పుట:Haindava-Swarajyamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిజముగా .నాగరకమన నేమి.

22

పెట్టు నేటి మధ్యస్థు లప్పుడు లేదు. ముఖ్య పట్టణములలో వాని చుట్టుపట్టును ఆ సూత్రము న్యాయస్థాన విచారమైన నుండినది . సాధారణముగా ప్రజతమ గ్రామములలో తాము స్వతంత్రముగా జీవించుచు వ్యవసాయాదికములను చేసికొనుచుండిరి. స్వరాజ్య మును అనుభవించుచుండిరి,


నేటి నాగరకము దూరని యట్టిఘట్టములలో, భారతభూమి నేటికినీ పూర్వమువలెనే యున్నది. అక్కడివారు మనలను చూచునప్పుడు మననవనసమార్గములను నవ్వుదురు. వారిపై ఇంగ్లీషు అధికారమును లేదు. మీయధి కారమును నుండబోదు. ఎవరి ప్రతినిధులము మనమని మాటలాడుచున్నామో వారిని మన మెరుగము. వారు మనల నెరుగరు. మీరును మీవలె దేశాభిమాను లైన యితరులును ర్లై చేరని యట్టి ప్రదేశములకు పోయి అచ్చట ఆరుమాసము లుండి రావలసినదని నా యిష్ట ము. అప్పుడు దేశాభిమానముతో మీరు స్వరాజ్యమును గు రించి మాటలాడవచ్చును.

నిజమైన నాగరక మనగా యర్థమేమో ఇప్పుడు మీకు తెలిసియుండును. నేను వర్ణించియుండు ఈ స్థితిగతులను మార్చ దలంచునట్టి వారు దేశద్రోహులు. పాపులు .


చదువరి: తామువర్ణించినట్లే భారత భూమియుండు నేని బా గుండును. అయిన నీ దేశములో ఎందరో బాల వితంతువులు న్నారు. ఎందరకో రెండు సంవత్సరముల వయసున నే శిశువివా