పుట:Haindava-Swarajyamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75

నిజముగా నాగరకమననేమి

.


మన మన మెంతటి సంతోష మింద్రియములకు కలిగింతుమో అంత యెక్కువగా నవి ఆశలననంతము చేయుచుండును. కాబట్టి పూర్వీకులు మనభోగములకు మట్టు లేర్పరచిరి. సౌఖ్యము మానసిక స్థితి యనుటను గ్రహించిరి. ద్రవ్యమున్నంతమాత్ర మున మూనవుడు సుఖికాడు. ద్రవ్యము లేనందున బీద వాడు సౌఖ్యము లేనివాడు కాడు. కోట్లకొలది ప్రజ యెల్లప్పుడు బీదలే. ఇదంతయు గమనించియే మన పెద్దలు మనలను భోగములనుండి భాగ్యములనుండి వారించిరి. వేలయేండ్ల క్రిందనుండిన నాగటి వంటి నాగటితోనే మనము కాలముగడుపుచున్నాము. పూర్వ పు కుటీరములపోలు కుటీరము లే నేటికినిమనకు నిలుచుటకాధా రములై యున్నవి. మన దేశీయ విద్యకూడ నాటిదే నేడు.జీవిత మును దుర్భరముచేయు పోటీపధ్ధతి మనది కాదు. ప్రతివాడును తన వృత్తినివ్యాసానమును చేసికొని తదనుగుణనుగు ద్రవ్య మును సంపాదించును. యంత్రములు చేయుటకు మన పెద్దలకు తెలియదన రాము .అయిన మనము అనుభోగములపయి ఆశ పెట్టితిమేని వానికి దాసులమగుదుమనుట వారెరుగుదురు. మన నైతిక జీవనము నశించుననుటయు వారు గమనించిరి. బాగుగ నాలోచించి వారందుచేతనే మనకు దైవమిచ్చిన కాలు నేతులు పయోగించి యెంతపని చేయనచ్చనో అంత మాత్రము పనినే నియోగించిరి. మనయనయవముల సర్వినియోగమే నిజమగు