పుట:Haindava-Swarajyamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
60

హైందవ స్వరాజ్యము.

బృవుల కాకరమీక ప్రతివాడును తన మతమునందలి సత్యము నేరిగినచో పోట్లాటలకు అవకాశమే యుండదు.


చదువరి: మన ఇరు తెగలను ఇంగ్లీషువా రెప్పటి కైనను చేర నిత్తురా ?


సంపా : మీ యధైర్యమే ఈ ప్రశ్నకు కారణము. మన తెలివితక్కువకిది తార్కాణము. ఇద్దరు సోదరులు సుఖముగా శాంతముగా బ్రదుక దలచుకొనిన యెడల , మూడవవానికి చెరుపసాధ్యనూ! దుష్టబోధలను వినినచో వారిని మన మవివే కులమనమా? ఇంగ్లీషు వారు హిందూ మహమ్మదీయుల విభేద పరుపగలిగిన యెడల అది మన లోపమే కాని వారిలోపమంతగా కాదు.మృద్ఘట మొక్క రాతి తాకుడునకుగాకున్న మరియొక్క రాతి తాకుడున కైనను పగులగలను. కాబట్టి ఆ ఘట మును సంరక్షించుటకు మార్గము రాయిరప్పనుండి దూరము తీసుకొనిపోవుట గాదు. చక్కగా కాల్చి బలపరచుటయే పరమ సాధనము. మసహృదయములు మట్టివి కాకూడదు.వజ్రసన్నిభ ములుగా తప్తములైనవి కావలెను. అప్పుడు సర్వాపాయ ములనుండి సంరక్షితుల మగుదుము. ఈపని హిందువు లెక్కు వగా చేయవచ్చును. వారు సంఖ్యలో నెక్కువ. విద్యా వంతులనికూడ చెప్పుకొంచరు. అందుచేత హిందూమహ మ్మదీయ సఖ్యము చెడకుండ కాపాడుటకు వారెక్కువ “సమర్థులు.