పుట:Haindava-Swarajyamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

59

భారతభూమిస్థితి.

వారు చరిత్ర వ్రాయుటయం దొకమార్గము తొక్కుదురు ; లోకములోని యెల్బరగుణములను అభ్యాసములను వారుగ్రహిం చుట నటింతురు. దైవము మనకు పరిమితమగు బుద్ధిని ప్రసా దించినవాడు. వారతని ధర్మములను తామే తలధరించి నవనవ ప్రయోగములనన్నియు గావించుచుందురు. తమ కని పెట్టిన వానిని గురించి తామే అట్టహాసముగా వ్రాసి మనకు నమ్మకము కలుగునట్లుగా మోహమున పడవేయుచున్నారు.మనమ జ్ఞానముమై వారి పాదముల కెరగుచున్నాము.


దుర్మతమును మానదలచుకొనునారు కొరానును చదివి చూడవచ్చును. హిందువులకు అంగీకారార్ల ములైన సూత్రము లందు నూర్ల కొలదికలవు. అ దేరీతిని భగవద్గీతలోను మహమ్మ దీయుల కేమాత్రమును అభ్యంతరా ములుకాని సూత్రము లెన్ని యో యున్నవి. కొరానులో నాకర్ధము కానట్టివో నాకు రుచింపనియట్టివో వాక్యము లున్నవని నేను మహమ్మదీయులతో పోట్లాడుదునా ! ఇరుపక్షములున్నగాని పోట్లాట పొసగదు. కాబట్టి నేను మహమ్మదీయ సోదరునితో పోట్లాడ నిచ్చగింప నేని నాపై పోట్లాటను తెచ్చి పడ వేయజాలడు. అదేరీతిని పోట్లా టకు తాను సాయముచేయడని మహమ్మదీయ సోదరుడను నేని నాకును పోట్లాటకు శక్తి కలుగదు, అంతరాళమున చేయివిస రిన చేయి నొప్పిపట్టవలసిన దే కాని మ రేమియు కాదు. ఆచార్య