పుట:Haindava-Swarajyamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
61


భారతభూమిస్థితి.


పరస్పరము ఈ రెండు సంఘములకు అవిశ్వాసము కలదు.. మహమ్మదీయు లందుచేత మార్లీ ప్రభువునొద్ద కొన్ని ప్రత్యేక స్వాతంత్ర్యములు కోరుచున్నారు. దీనిని హిందువు లేల ప్రతి ఘటింపవలెను ? హిందువులు ప్రతిఘటింపక యుండినచో ఇంగ్లీషు వారికది మనసున కెక్కును. మహమ్మదీయులు క్రమముగా హిందువులను విశ్వసింతురు. సోదర భావము ఫలించును. ఇంగ్లీ షువారి వద్దకు మనవిభేదములను తీర్పునకు కొనిపోవుట సిగ్గు మాలిన తనము. ఊరకుండిన హిందువునకు నష్టము లేదనుట యెవ్వరికై నను అర్థము కావలసిన దే. ఒకడు రెండవవానికి విశ్వాసపాత్రుడగునేని మొదటివానికి నష్ట మెక్కడను సంభ వింపదు.


హిందూమహమ్మదీయు లెప్పుడును పోట్లాడుకొనరని నే ననువాడను కాను. ఏక కుటుంబములో నివసించుసోదరు లే ! యెన్ని విషయములలోనో కలహింతురు. నెత్తులు పగులగొట్టు కొందురు. అట్లు జరుగవలెననుట అవసరము కాదు. కానియెల్లరు లోకమున సమభావులు కారు. ఆగ్రహావేశు లైనప్పుడు మనుష్యు లెన్ని యో వివేకవిహీనప్రవర్త నలపాలగుదురు. ఇవియన్నియు మనము భరింపక తీరదు. అయిన,మనము పోట్లాడుకొని నప్పుడు ఇంగ్లీషు న్యాయస్థానములకు గాని మరియే న్యాయస్థానము లకుగాని పోనక్కర లేదు. న్యాయవాదుల నియమించుకొన