పుట:Haindava-Swarajyamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
58

హైందవ స్వరాజ్యము.


పొడిచి కన్నకష్టముల బెట్టు హిందువు లెందరు లేరు. అప్పు డెవరు సంరక్షణకర్తలు ! ఇదెల్ల యు మన యేక జాతీయత కడ్డ మువచ్చినదా?


తుదివిషయము. హిందువు లహింసావాదులును మహమ్మదీ యులు తదితరులును అగుట నిజమే యయినచో హిందువుల ధర్మమేమి? అహింసా మతానుసారి సోదరమానవునిచంపవచ్చు నని ఎవరు లిఖించిరి ! అతనికొక్కటే ఋజుపథము. ఒక జీవ మును కాపాడుట కింకొకని జంపరాదు. మనసు కరగునట్లు ప్రార్థింపవచ్చును. అంతియే తనధర్మము.


ఇక, ప్రతిహిందువు అహింసావాదియేనా ? బునాదులకు దిగి ఆలోచింతు మేని మనలో నొక్కడు కూడ అహింస మత ముగా బ్రతుకుట లేదు. మనము ఏదో యొక రీతిని జీవహింస చేయుచునే యున్నాము. హిందువులలో అనేకులు మాంసా హారు లున్నారు. వారెబ్బంగిని గూడ అహింసావలంబకులు గారు, హిందువులహింసాపరులు మహమ్మదీయులు కారు, కాబట్టి వీరికి పొత్తుపొసగదు, అనువాదము ఈ కారణము చేత మృషా వాదము.

స్వార్థపరులగు ఆచార్యబృవు లీ గండరగోళము నంతయు కల్పించుచున్నారు. ఇంగ్లీషువారందుకు మెరుగు పెట్టుచున్నారు.