పుట:Haindava-Swarajyamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57

భారత భూమిస్థితి.

నసాధ్యము కావున గోవును పోనిచ్చుట తప్పదు. గోవు నెడల నా కత్యంత ప్రియం బైన యెడల దానిసంరక్షణకై నాప్రాణము సమర్పింపవలసిన దే తప్ప అందుకయి యొరుల ప్రాణము కొన రాదు. ఇది మనమతముయొక్క, సిద్ధాంతమని నావిశ్వాసము. మనుష్యులు 'పెడబుద్ధులై నప్పుడు పరిస్థితి విషమ మగును. నే నేదాడనిన మహమ్మదీయ సోదరుకుకోదాడనును. నేనుగం భీర దృష్టి నటించిన అత డట్టిరీతినే ప్రత్యుత్తరమిడును. అతనికి మర్యాద గా నమస్కరి చిన ఆతడు పదింత లెక్కువమర్యా దతో నమస్కరించును. అట్లు చేయడేని "నేనమస్కరించుట దోషమని యెవ్వరును ననబోరు. హిందువు లెప్పుడు పోరు పె ట్టిరో ఆనాడు గోహింస మిక్కుటమయ్యెను. నాయభిప్రాయ మున గోరక్షక సభలు నిజముగా గోహింసక సభలు. అట్టిసభ లవసరమై యుండుటయే మనకు లజ్జాకరము. గోరక్షణ మార్గము మనము మరచినందు చేతనే ఈసభలవసర మైనవి. రక్తసంబంధ సోదరుడు గోసంహారమునకు కడంగినాడు. నేనేమి చేయవలెను ! అతనిని పైబడి సంహరింపవలెనా లే కున్న నతని పాదములబడి ప్రార్థింపవలెనా ! రెండవమార్గ మే అవలంబనీయ మందురు కదా! ఇప్పుడు మహమ్మదీయ సోదరుని యెడ నవలంబింపవలసిన మార్గ మదియేకదా ?


హిందువులు గోవులను హింసించి నశింపజేయుట లేదా? అప్పు డెవరు వానినిరక్షించుచున్నారు.గోసంతతిని కర్రలతో