పుట:Haindava-Swarajyamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము.

భారత భూమిస్థితి.

హిందువులు-మహమ్మదీయులు.


సంపా: మీరు కడపట నడిగిన ప్రశ్న చిక్కుది. కాని ప్రత్యు తర మెంతో కష్టము కాదు. రైళ్లు, వకీళ్లు, వైద్యులు ఉండుట చేత ఈ ప్రశ్న కవకాశము కలిగినది. రైళ్లను గురించి ఆలోచించి నాము, మరి ఇప్పుడు వకీళ్లు, వైద్యులను గురించి . అలోచిం తము. స్వభావముచేత మనము కాళ్లు చేతు లెంతదూరము తీసికొనుపోవునో అంతమాత్రమున కే అర్హులము. రైళ్లు మొద లైన మోహకరసాధనముల మూలకముగా తావునుండి తా వునకు పిచ్చి వేగమున పరుగిడకుందుమేని అనవసర గందర గోళము లుండి యుండవు. మనకష్టములు మననిర్మితములే. మానవ శరీరము నేర్పరచి నప్పుడే యీశ్వరుడే శరీర సంచలన మునకు. నొక మితి యేర్పరచెను. వెన్వెంటనే మానవుడు ఆ మితిని మీరుటకు సాధనములు వెదక మొదలిడెను. మాన వుడు తన సృష్టికర్త నెరుంగునుగాక యని అతనికి బుద్ధి బలము కలిగెను.మానవుడు దానిని దుర్వినియోగము చేసితనసృష్టికర్త నే మరచెను. నేను నాచుట్టుముట్టు నుండు వారలకు తోడగునట్లు