పుట:Haindava-Swarajyamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53

భారత భూమిస్థితి.


మాత్రమే దైవమునన్ను నియమించినాడు. కాని గర్వముచేత నేను ప్రపంచములోని ప్రతిమానవునకు తోడగుదునని నటిం చున్నాను. ఈరీతిని అసాధ్యములను సాధ్యముచేయ నాలో చించుటలో మానవును అనేక భిన్న స్వభావములను భిన్నముఖ ములను ఎదుర్కొననలసిన వాడగుచున్నాడు. అందువలన ఎక్కడ లేని గందరగోళమున పడిపోవుచున్నాడు. ఈ హేతు వాదమును నంగీకరించు నెడల రైళ్లు మహానర్థదాయకము లనుట నాకర్థము కాగలదు. అవి కారణముగా మానవుడు సృష్టికర్తనుండి యెంతో వేరుపడిపోయినాడు.


చదువరి: కానిండు. నా ప్రశ్నకు నుత్తరమునకై మిక్కిలి యాతురతతో నెదురుచూచుచున్నాను.మహమ్మదీయుల రాకతో మన జాతీయత పోలేదా ?


సంపా; వివిధమతములవారు నివసించినమాత్రమున భారత భూమి యొక్క జాతి కాకపోలేదు. విదేశీయులు వచ్చినతోడనే దేశజాతి నశించిపోదు. వారు దీనియందు లీనమైపోదురు. ఇది జరిగినప్పుడు దేశ మొక్క జాతియేకాని వేరుకాదు. దేశమునకు ఇతరులను తనలో లీనము చేసికొను శక్తిమాత్రముండవలెను. భారత భూమికి ఎల్లప్పుడును ఆశ క్తికలదు. నిజమరయగా తలకొ క్కమతమను తప్పదు. కాబట్టి జాతితత్త్వము నెరిగినవా రెవ్వ రును మత భేదములను గణింపరు. అట్లుగణింతు రేని వారుజాతి