పుట:Haindava-Swarajyamu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైందవ స్వరాజ్యము.

మొదటి ప్రకరణము.

దేశీయ మహాసభ : తదధికారులు.

చదువరి : నేటిదినము మనభూమిలో ప్రజలు స్వరాజ్యము స్వరాజ్యము అని బహుభంగుల మాట్లాడుకొనుచున్నారు. అందుకై అందరు వాపోవుచున్నట్లున్నది. దక్షిణాఫ్రికాలో మరి యితర ప్రాంతములలో కూడ ఇదేరీతిని మన వారు ఆశల తోనున్నారు. భారతభూమి స్వాతంత్యములకు ఆతురపడు చున్నది. తమరీవిషయమున అభిప్రాయమిత్తురా ?

సంపాదకుడు : ప్రశ్న చక్కగానడిగితిరి. ప్రత్యుత్తరమి చ్చుటమాత్రమంత సులభముగాదు. పత్రికాధికారులకు మూడు ముఖ్యధర్మములు కలవు. లోకుల అభిప్రాయములను కని పెట్టి వెలిబుచ్చుట యొక ధర్మము ; ప్రజలలో సక్రమములు సమం జసములు నగు క్రొత్తయాశయములను జనింపజేయుట మరి యొక ధర్మము ; ప్రజలకుగల కష్టనిష్టూరములను జంకు కళంకు లేక బహిరంగ పరచుట మూడవధర్మము. మీప్రశ్నకు ప్రత్యుత్తరము చెప్పుటలో ఈ మూడుధర్మములును నేక కాలమున నెర వేర్చవలసివచ్చుచున్నది. కొంతవరకు ప్రజల సంకల్ప