పుట:Haindava-Swarajyamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైందవ స్వరాజ్యము.

మును బహిరంగపరచవలెను. కొంతవరకు కొన్ని యద్బోధన లను ప్రకటింపవలెను. కొన్ని కొన్ని కష్టనిష్టూరములను విమర్శింప వలెను. మీరు ప్రశ్న యడిగితిరి గావున ప్రత్యుత్తరమిచ్చుట నావిధి.


చదువరి : అట్లయిన మనలో స్వరాజ్యమునకయి అభిలాష జనించిన దనియేకదా మీ యభిప్రాయము.

సంపా: ఆ యభిలాషయే దేశీయ మహాసభకు పుట్టువు కల్పించినది. " దేశీయ" మను పదప్రయోగమే దానిని వెలిబుచ్చుచున్నది.

చదువరి : మీరు చెప్పునది సరిగాదు. నవయౌవన భారత భూమి దేశీయమహా సభను అలక్ష్యముతో చూచునట్లున్నది. అది బ్రిటిషు పరిపాలనను అనంతము చేయు సాధనమని ఇప్పటి యౌవనులు తలంచుచున్నట్లున్నారు.

సంపా : ఆయభిప్రాయము న్యాయము కాదు. భారతపితా మహుండగు మన దాదాభాయి నౌరోజి శంఖుస్థాపనచే యనిచో నేటిదినము మన యౌవనులు స్వరాజ్యమును గురించి మాటలాడుటకైనను అవకాశముండి యుండదు. హ్యూము మహాశయుడు వ్రాసినది మనము మరువజాలము. ఆతడు మవలను కార్య దీక్షకు బురికొల్పినది స్మరింప క వీలు లేదు... దేశీయమహాసభోద్దేశములను సాధించుటకు ఆత డెంత ప్రయ