పుట:Haindava-Swarajyamu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ii

హైందవ స్వరాజ్యము

గొంపోవలసియున్నది. అట్టి సందేశమును గొంపోవ గాంధి మహామహులుద్భవించిరి. వారు అవతారపురుషులు. వారి కీర్తి లోకమున దివ్యకీర్తుల ప్రసరించి భారతసం దేశముంగొంపో వును. అట్టితరి వారిచే రచియింపబడిన హైందవ స్వరాజ్యము" ను ప్రచురించుటయే యుత్తమమని తలంచి మేమట్లోన రించితిమి,

ఈ మానూతనోద్యమమునకు సుధీ లోక మెల్ల ప్రోత్సాహ మొసంగి మమ్ము ఇకముందు నిట్టి యుద్గ్రంధముల ప్రకటించు నటుల చేయుదురుగాక యని. ప్రార్థించుచు యీ చిన్న పోత్తం బును బంధింపబడిన మనమాతకు నంకితంబుగావించి విరమించు చున్నారము.

చెన్నపురి, శ్రీవాసంత గ్రంథని లయము.


రెండవముద్రణపు పీఠిక.

ఆంధ్రదేశమునం దనేకులకు సులభ లభ్యంబగుటకు రెండవ ముద్రణమును వేయించి చాల చౌకధరకిచ్చుచున్నారము. ఆంధ్రలోకము మాయుద్యమమునకు ప్రోత్సాహము నొసంగు కోరుచున్నారము.

ఉపేంద్ర ప్రచురణాలయము.