పుట:Haindava-Swarajyamu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

317

నమరనదీజలం బమరఁ దెప్పించి
శ్రీకరంబుగ నభి షేకంబు చేసి .................................2860
'శ్రీకంఠుకరుణావి శేషంబు వలన
ధరణీతలం బెల్లఁ దగ నేలు' మనుచుఁ
గర మొప్పఁ బట్టంబు గట్టి రావేళ
గమలాసనుం డాదిగా మునివరులు
నమర దీవించి మంత్రాక్షత లిడిరి
తిరముగా ఘోషించే దేవదుందుభులు
పొరిఁ బొరి వర్షించెఁ బుష్పవర్షములు
పాడిరి గంధర్వభామిను 'లెలమి
నాడిరి వేఁడుక నప్సరః స్త్రీలు
చల్లనై విభుమీఁదఁ జందనానిలము.............................2870
నుల్లంబు వికసింప నొయ్యన నెల సె
బర మేశుఁ డప్పు డాపార్టీ వేశ్వరునిఁ
బరఁగ దీవించి “నీపట్టణంబునకు
భూనుత వైభవంబున నేఁగు' మనుచుఁ
దానును సురలు నంతర్ధానమొంది

[1]*(గోరంత వసిష్టసంయమి గాధినుతుని పంతంబుమాటలు పచరించి 'మిగుల నొంచి నాతనయుల నూర్వుర నీవు ద్రుంచునప్పుడు నింత దుఃఖంబు లేదు యకట హరిశ్చంద్రు నతికష్టవృత్తి....................................2880.

............................................................................................................

.

    • ఈకుండలీకరణములోనిది పెక్కు ప్రతులం గానరాదు. మఱియునిందు లక్షణ
    దోషములును దక్కిన భాగమున లేనివి గనుపట్టుచున్నవిగాన యిది ప్రక్షీప్తమే