పుట:Haindava-Swarajyamu.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
316

హరిశ్చంద్రోపాఖ్యానము

నచ్చుగా మితలం పానతీ వలయు”
ననిన హరిశ్చంద్రు నావసిష్ఠుండు
గనుఁగొని తన పెంపు గాన రాఁ బలికె
'జగతి నిక్ష్వాకువంశ జులసత్కీర్తి............................28411
మిగులంగ నీచేత మెఱుఁగు వాటిల్లె
నాపురోహితుఁ డని ననుఁ బెద్దఁ జేసి
నాపూన్కి చెల్లించినాఁడ వీ వనఘ
యిట్టిసత్యవ్రత మిట్టియాదార్య
మిట్టి తెంపును గాన మెవ్వరియందు
నెలమితోఁ గౌశికుం డేపని వని చె
నలవడఁ గావింపు మదియె నాతలఁపు'
నావుడుఁ దనగురునాథువాక్యములు
ద్రోవక గాధిపుత్రునిమాట సేయ
ననుమతించె న రేం ద్రుఁ డట శివ శక్ర......................2850
వనజాసనుల మునివరుల పంపునను
దివ్యగంధంబుల దివ్యమాల్యముల
దివ్యభూషణముల దివ్యాంబరములఁ
గులపతితోఁ గూడఁ గువల యేశ్వరుని
నెలమి నచ్చర లెల్ల నెమ్మి గై సేయ
నాసమయమునఁ బూర్వాద్రిశృంగాభ
భాసురం బగు చున్న భద్రపీఠమున
రమణీయ నుగు హేమరత్న కుంభముల

........................................................................................................

పూర్వాద్రి... భాసురము తూర్పు కొండశిఖరముతో సాటిగా ప్రకాశించు చున్న ది, హేమము=బంగారు, అమరన దీజలంబు = గంగాజలము, బకము=కొంగ,