పుట:Haindava-Swarajyamu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

309

ద్వితీయ భాగము.

కలఁగక కపటమార్గమునఁ జరించు
కలిరాజు గాని తాఁ గాఁడు (బాహణుఁడు
మతి నింక నీ కనుమాన మేమిటికి
ధృతిఁ జూడు' మని దివ్యదృష్టి నిచ్చుటయు
నంతయు విస్మయం బడర వీక్షించి
సంతోషమునఁ బొంది సతియును దాను
నొక్కట సాష్టాంగ మొనరించి భక్తి..................................2700
నెర్కొన 'పరమేశ నీ ప్రసాదమున
నరిగె దురోహమదాంధకారంబు
పరఁగె సమ్య జ్ఞానభాస్కరోదయము
నీభవబంధంబు లిన్ని యుఁ బాపి
నీభ క్తుగా నేలి నీ సేవ మరిపి
నన్ను మన్నింపవే నమ్రవిధేయ
నన్ను రక్షింపవే నాగ కేయూర
నీకు మొక్కఁగఁ గంటి నినుఁ జూడఁ గంటిఁ
బాకటంబుగ జన ఫల మబ్బె నాకు
నిండు నెమ్మది నిన్ను నిలుపుట దక్క........................2710
నొండువరంబు నే నొల్ల నీ యాన'
యనునప్పు డా రాజునర్ధాంగలక్ష్మి,

...................................................................................................

జ్ఞానమ నెఁడు గొప్పచీకటి, సమ ... దయము=మంచి జ్ఞానమ నెడి నూర్యోద యము, నమ్రవి ధేయ అడఁకువతోభజించువారికి పరతంత్రుఁడైనవాఁడా, నాగ కేయూర = సర్పములు బాహుపురులు గాఁగలవాఁడా, 'నిండు నెమ్మది కన్ను నిలుపటదక్క' = నాపూర్ణ హృదయములోనిన్ను నెలకొలుపుట తప్ప, అర్ధాంగలక్ష్మిన్ = భార్యను - చంద్రమతిని, కాత్యాయని= ఫార్వతి, బాములన్