పుట:Haindava-Swarajyamu.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
310

హరిశ్చంద్రోపాఖ్యానము

దనకృపాదృష్టిఁ గాత్యాయని చూచి
‘రా చంద్రమతి పతివ్రత నౌదు వీవు
నీ చరిత్రంబు వర్ణింప నచ్చెరువు
సుదతి నీమంగళసూత్రంబు గాదె
పదివేల బాములఁ బాపె నీపతికి
సౌభాగ్యవతివి గా సకలసామ్రాజ్య
వైభవంబుల మించి వసుధ నేలుచును
బెద్దగాలమునకుఁ బ్రియుఁడును నీవు........................2720
నొద్దిక వచ్చి మాయొద్ద నే యుండుఁ'
డని కుస్తరించి “నీ వడిగినవరము
కొను మిత్తు' మనిన నక్కొండ రాచూలి
పదముల వాలి 'భూపాలబాలకుని
బ్రదికించి నానిందఁ బాపి రక్షింపు
సకలజగన్మాత శాంభవి' యనుఁడు
వికసితవదనారవింద యై గిరిజ
“నీచి త్తశుద్ధికి నెఱయ మెచ్చితిని
రాచపాపఁడు మున్ను బ్రతుకు లోహితుని
ప్రాణ మిచ్చితి హరు పంపున' ననిన..........................2730
మాణిక్యకీలిత మంజుముంజీర
కంకణకింకిణీ కాంచనవలయ
ఝంకృతు లొలయ వజ్రపుటంటుజోడు

...........................................................................................................

=ఆపదలను, కుస్తరించి = బుజ్జగించి, కొండరాచూలి= పర్వత రాజై నహిమవంతు నికూఁతురగు పార్వతి, భూపాల బాలుకుని = కాశిరాజుబిడ్డను, హరుపంపునః =శి వునియాజ్ఞ చేత, మాణిక్య... ఝంకృతులు రత్నములు పొదుఁగఁబడిన సొగ సై నయం దెలు కడియములు, చిఱుగ జ్జెలు మొలనూలు, వీనిఝంకారధ్వనులు, సేవ