పుట:Haindava-Swarajyamu.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
308

హరిశ్చంద్రోపాఖ్యానము

మొగము వ్రాలఁగవైచి మునుకుచు నున్న
వానితలంపు భావంబున నెఱిఁగి
యానీలకంధరుం డనియె నవ్వుచును
“సొదలనీ ఱలఁది యచ్చుగఁ దోలు గప్పి
పొదివి నిచ్చలు బహుభూతముల్ గొలువ
నీవల్ల కాటిలో నిటు విహరింప........................................2680
నావంటివాడ వై నాఁడవు నీవు
నిది గాధిపుత్రుమ హేంద్రజాలంబు
విదితంబుగా నీకు వివరింతు వినుము
మసనంబు గాదిది మఘశాల గాని
యెసఁగు శల్యములు గా విధ్యముల్ గాని
పడినపున్కలు గావు పాత్రలు గాని
యడరు నెత్తురులు గా వాజ్యంబు గాని
యొలయు కొర్వులు గావు యూపముల్ గాని
తల వెండ్రుకలు గావు దర్భలు గాని
వెఱవక ని న్నే లువీర బాహుండు..................................2690
మఱియుఁ గాలుఁడు గాని మాలఁడు గాఁడు
వినుము నీకూర్మి దేవిని నేలుచున్న
'యనఘుండు కౌశికుననునుతి నిలిచి

...........................................................................................................

= చితియందలిబూడిద, పొదివి= చుట్టుకొని, “బహుభూతమునిచ్చలుపొదివి కొలువన్ అని యన్వయము, నావంటివాఁడవు= "నే నెట్లు వల్ల కాటిలో పూర్వో కవిధములనుందునో యట్లే నీవును న్నాఁడవనుట, మసనంబు = వల్ల కాడు మఘశాల = -యజశాల, ఇద్మముల్ =కట్టెలు, ఆజ్యము= నెయ్యి, యూపముల్ = 'యూప స్తంభములు, కాలుఁడు=యముఁడు, దుర్మోహ... కారంబు = చెడ్డయ