పుట:Haindava-Swarajyamu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
294

హరిశ్చంద్రోపాఖ్యానము

దోష మేవెంటను దొడరునో చనదు
దూషింప భూషింపఁ దుది నెంతవట్టు
తప్పును నొప్పును దైవ మెఱుంగు
నొప్పు నూరక చూచుచుం'టను వారు
పలువు రీరీతిని బలుచందములను
బలుకంగ నావీర బాహునిక డకు
వదలక కొనిపోయి వసుధీశుఁ డాత్మ.............................2430
జెదరక మును మూడు సెలవులు నొసఁగి
యాన తిచ్చినచందమంతయుఁ దెలియ
వానికిఁ జెప్పి యవ్వన జాక్షి, నపుడు
బెడిదంపు బావురుఁబిల్లివాతికిని
దొడిఁబడ రాచిల్కఁ ద్రోయుచందమున
దగ నప్పనము సేసి తలవరుల్ దాను
మగిడి భీషణుఁ డేఁగె మనుజేశుఁ గొలువ
వీర బాహుండును విభునాజ్ఞ సేయఁ
గోరి చయ్యన నతి క్రూరవ ర్తనులఁ
గ్రోవ్వాడి మృత్యువుకోఱలు వోలె......................................2440

........................................................................................................................

జోలియేల, దోషమే ... దొడరునో = ఎట్లు చెప్పి తేదోషము గూడవచ్చునో,చ నదు దూషింపభూషింపన్= దూషించుటయు భూషించుటయు రెండును ఒప్పు దు. కుది... మెఱుఁగు=కడపటనీవిషయమున త ప్పెంతమాత్రమో ఒ ప్పెంతమా త్రమోదైవ మే యెఱుఁగును. ఒప్పునూరక చూచుచుంట = ఊరక చూచుచు మాత్ర ముండుటయేతగును. మూఁడు సెలవులునొనఁగి= ముమ్మాటికీ ఆజ్ఞ చేసి,అప్పనము చేసి =అప్పగించి, అతిక్రూరవ ర్తనులన్ = మిక్కిలిక్రూర మైన నడవడిగలవారిని, వ్వాఁడి మృత్యువుకోఱలు= మిక్కిలివాడియైనమృత్యువు యొక్క కోఱపండ్లు,మ