పుట:Haindava-Swarajyamu.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

293

'రోటలు దాఁటి యీగోడలు దాటి
తాళంబు లెడలించి తలుపులు దెఱుచి
కేళిమై రొప్పుజాగిలముల మొఱఁగి
దాది వాకట్టి భూతలనాథుపట్టి.................................2410
నాదట నీరీతి నర్రొత్తి చంప
నూహింప నెవ్వఁడో యొకకన్న గాఁడు
సాహసంబునఁ బోయి చంపి యీతొడవు
లను వొండఁ గొనిపోవ నంత నారెకులు
తను గూడముట్టినఁ దరలాక్షి మీఁదఁ
జొప్పు పుట్టంగ నాసొమ్ములు వైచి
తప్పించుకొని పోయెఁ దన ప్రాణభీతి
నేరము దనమీఁద నెరసిన లం
గూరి భూపాలునికొలువులోపలను
నిలిచి భాషింపఁగ నేరక చావు .....................................2420
కలుగక చనుచున్న' దనువారు గొంద
'రిది 'బాలఘాతుకి యెద నెన్ని చూడ
నిది వధూవధ దీన నె ట్లాడ నెట్లో

.............................................................................................

యందుండును, ఎడలించి = ఊఁడునట్లు చేసి, జాగిలములు = వేఁటకుక్కలు, మొఱఁగి = ఏమరించి, ఆదటన్ = ఆసక్తితో, అర్రొత్తి మెడఁబట్టి, ఆరెకులు =తలారులు, కూడ ముట్టినన్ కూడునట్లు వచ్చి పైకొనఁ గా, చొప్పుపు ట్టంగన్ దొంగజాడకలుగునట్లు, నెరసినన్ = వ్యాపింపఁగా మోపంబ డఁగాననుట, లజ్జఁగూరి = సిగ్గునొంది, ఇది ... నెట్లో ఒక ప్రక్కచూడఁగా, నిది బాలఘాతుకి గాన వధింపఁదగును. మఱి యొక దృష్టి నిజూడఁగా ఇది స్త్రీ గాన స్త్రీవధ ముదగదు. కనుక తగును తగదు అని ఎట్లు చెప్పి తే నేమి వచ్చునో మనకీ