పుట:Haindava-Swarajyamu.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

295

ద్వితీయ భాగము.

మవ్వంపుమెఱుఁగులమాడ్కి మేలైన
బిత్తరంబులు సిమ్ము బెడిదంపువాలుఁ
గత్తులు గలభయంకరులఁ గింకరుల
వీక్షించి 'మీరెల్ల వెసఁ బ్రేతభూమి
కక్షీణగతి నేఁగి యచ్చోట నున్న
వీరదా సను నెఱవీరుని చేతి
కీరమణీమణి నిచ్చి చంపింపు'
డనుటయు వార లయ్యతివదోడ్కొనుచుఁ
జని వీర దాసునిసన్నిధి నిలిపి
పతియానతియు వీర బాహునిపంపు........................2450
నతిచిత్రముగఁ జెప్ప నది విని యలికి
వెఱఁగంది 'బాపురే విధిచేఁతఁ గడువ
నెఱవాదు లెవ్వరు నిఖలలోకముల
నేటితోఁ గడముట్టెనే కౌశీకుండు
గాటంబుగా సల్పుకపటనాటకము
వెఱచిన వానిని వెన్నిచ్చి యోడి

-...............................................................................................................

వ్వంపుమెఱుఁగులు= లేఁత మెఱుపు(దీఁగలు. ఈ రెండును బెడిదంపువాలుఁగత్తులకు విశేషణములు, వాలుగత్తులు బెడిదములగుటకు క్రొవ్వాడి మృత్యువుకోఱలునుబిత్త రములు చిమ్ముటకు మవ్వంపు మెఱుఁగులుసు ఉపమానములు,బి త్తరములు= బెళ బెళ కాంతులు, బెడిదంపు=భయంకరమైన, అక్షీణగతిన్ కొఱవడ నినడతో వేగముగా నడచి, విధి చేత = దైవకృత్యమును, కడవన్ = అతిక్రమించు టకు, నెఱువాదులు- నేర్పరులు,కడముట్టె నే= ముగింపునొందినదా. గాటము గాన్ =కఠినముగా, కపట నాటకము=బూటకములుపన్ని యాడించునాట. నేఁటితో ముగింపు నొందెనా యనుట, చంద్రమతి వధింపఁబడనున్న ది గనుక వధించుటలో