పుట:Haindava-Swarajyamu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

289


ద్వితీయభాగము.

సూడిద పెట్టి దా సురిఁగె నా చోరుఁ
డప్పుడు భీషణుం డాచంద్రమతిని...................2330
నిప్పులు గన్ను ల నిగుడ నీక్షించి
రోజువాసము నుల్చి కొని 'తన బారిఁ
బాతి పొమ్మ నుచు నుద్భటనృత్తి లేచి
జంకించి చేవాలు జళిపించి వ్రేయ
నుంకించి శంకించి 'యువిద వధించు
రట్టు నా కేటికి రాజు ముందర నె
పెట్టెదఁ గాకని పేరోలగమునఁ
గొడుకుకుఁ బలవించు కొనుమహీపాలు
కడ నిల్పి నవరత్న కాంతుల మించు
తొంగలించెడు బాలుతోడవులమూట..................2340
ముంగల నిడిన 'హా ముద్దుల పట్టి
హా కుమార యంచు నట వక్షమందు
దాకొన నొత్తి నేత్రముల నం దం ద
తొరుఁగున శ్రులఁ దొప్పదోఁగి శోకాగ్ని
నెరియుచు విలపించు చెట్ట కేలకును
గొంత ధైర్యము దెచ్చుకొని హరిశ్చంద్రు
కాంతాశిరోమణిఁ గనుఁగొని పలికెఁ

......................................................................................................

తప్పించుకొననట్లు, మచ్చంబుగా = గుఱుతు గా, సూడిద = కౌనుకి , సురిఁగె =మ రుగ య్యెను. నుల్చికొని= మెలిఁ బెట్టికొని, తన బారిఁ బాలి పొమ్ము = నాదా నుండి పరుగెత్తిపొమ్ము, నవరత్న కాంతులమించు = నవరత్నముల కాంతులయొ క్కప్రకాశము, తొంగలిం చెడు = ప్రకాశించెడు, తొడవుల మూట = సొమ్ము లముల్లె, దాకొన్" క దియునట్లు, దొడికి = తెగించి, అతి పలు :