పుట:Haindava-Swarajyamu.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
290

హరిశ్చంద్రోపాఖ్యానము

గటకటా నిన్ను నెక్కడి దురాత్మకుఁడు
'కుటిలుఁడై యిటు సేయఁ గోరి పుత్తెంచెఁ
దొడవుల కై తెంపుతోఁ బ్రాణములకు .....................2350
దొడికి ముద్దులపట్టిఁ దునుమ నేమిటికి
నను వేఁడుకొనిన నింతకు మేలిమైన
వినుత భూషణములు వెలఁది నీ కిడనె
సుకుమారు నత్యంతసుందరాకారు
నకట చంపఁగఁ జేతు లాడెనే నీకుఁ
బురుషులకంటె నెప్పుడు నారుగుణము
లరయ సాహస మెక్కు డతివల కనిన
యమరిననీతి వాక్యము నిజ మయ్యె
రమణిరో దానవురాలవు గాక '
యని చాలఁ గోపించి యప్పు డారాజు ...................2360
'ననుమానమే ల సయ్యన ధర్మ మెన్న
దీనితో భాషింప దీనిఁ గంగొనిన
నూనుఁ బాతక'మ ని యుర్వీశుఁ డాత్మ
నంతంత నడరుశోకా వేశమునను
వింతగా 'భీషణ విను' మని పలి కెఁ
బడఁతుక నా కన్న పట్టిపాదముల
కడ నిల్పి యీ బాలఘాతుకి శిరము
వెసఁ ద్రుంపు మని చెప్పు వీర బాహునకు

.....................................................................................................

దానవురాలవు = రాక్షసివి, ధర్మ మెన్న... బాతకము = ధర్మము నాలోచిం పఁగా నిట్టిఘాతుకితో మాటాడుటయు దీనిని గన్నెత్తిచూచుటయు నే పాత కముగావచ్చును, నాకన్న పట్టి = నేనుగన్నట్టి బిడ్డ ని యొక్క, ముమ్మరంబుగ వగ