పుట:Haindava-Swarajyamu.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
286

హరిశ్చంద్రోపాఖ్యానము

.

దడయక పుట్టించి ధాత్రీత లేశు
పడఁతిఁ జంపింప నుపాయంబుఁ గఱపి.........................2270
పొరిఁబొరిఁ 'బొమన్న బోయి తల్కావి
చిర ముండ్ల బంతియు సెలకట్టెకత్తి
బలపంబు భమరాలఁ బట్టిన క్రోవి
యొలికి లోపలిభూతి యొగి మైల మందు
కుఱునీలికా సెయుఁ గొంకి నారసము
నొఱపుగాఁ బూని వాఁ డుక్కున నేఁగి
యావారణాసిపురాధీశు నగరు
వావిరిఁ గన్నంబు వడి వేసి చొచ్చి
మిసమిస మనుచుఁ డొమెఱుఁగులు వారు
పసిఁడికుండల మేడపై నంద మైన...........................2280
తూఁగుటుయ్యలలోనఁ దొలు కార మెఱుఁగుఁ
దీఁగ బాగుననొప్పిదీపించు దాది
చెలువ మై మించిన సిబ్బెంపుగబ్బి
వలుఁదపాలిండ్లలో వడనాంబుజంబు
గదియ నిద్రించుచక్కనిరాచపట్టి
కదలక మెదలక కాలున నూఁది

...............................................................................................................

ర్యను , తల్కా విచిర = తలయందు కావి చీర, ముండ్ల బంతి = ముండ్లు వరుసగాగ లచెండు, సెలకట్టె మొద లైనవి దొంగ సాధనములు, భ్రమరాల క్రోవి = దీప మార్పెడి పురుగులుగల గొట్టము, ఒలికిలోపలి భూతి = కాలిన పీనుఁగుసొదలో నిబూది, మైలమందు స్త్రీరజ కృతమై వశీకరణసాధనమగు నౌషధము, తొలుకారు = తొలుకరి కాలము, సిబ్బెంపు గబ్బివలు దపాలిండ్లు= సిబ్బెములు గలిగి బటువులై విరివిగల చన్నులు, కదలక మెదలక కాలుననూఁది= కోలుచే