పుట:Haindava-Swarajyamu.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

285

ద్వితీయ భాగము.

నినుఁ డుదయాద్రికి నే తేక మున్న
చన కున్న నేలిక సానిచేఁ జావు...................................2250.
చెప్పు మే తెఱుఁ గన్నజింతించి తగవు
దప్పక నధిపుఁ డత్తన్వి కిట్లనియెఁ
'జెలువ యీ బాలునిఁ జిచ్చునఁ ద్రోయ
వలసిన నేలిన వానిలాభంబుఁ
దప్పించి సత్యంబు దప్పి మోమోట
నిప్పని కియ్యతో నేరీతిఁ బొసఁగుఁ
బొసఁగ వీ పలుకులు మోయి ని న్నేలు
వసుధామరునిఁ గాంచి వదలక వేఁడి
వలయుమాడయు మఱి వారి పాతికయు
వలనొప్పఁ గొని రము వడి నిట' కనినఁ.................... 2260.
దనప్రాణనాధుసత్యవ్రతంబునకు
మనమున నలరి యమ్మహి పతి కాంత
తనయు నక్కడఁ బెట్టి తగ నప్పగించి
మనుజేశునకు మొక్కి మసలక మరలి
పురవీథి నేఁగునప్పుడు కౌశికుండు
తరలాక్షిఁ జంపింపఁ దలఁచి యాక్షణమె
మొఱకు వెండ్రుకలును ముదురు మీసములుఁ
గజకునల్లని మేనుఁ గలచోరు నొకనిఁ

...............................................................................................................

దొర సానియైన కలహకంఠిక , చిచ్చునఁ ద్రోయవలసినన్ = నిప్పునందు వేయవలసి యుండినయెడల, ఏలినవాని లాభంబు దప్పించి = నా ఏలిక యైన వీర బాహునికి వచ్చు వాతిపాతిక మొదలైన యాదాయమును బోఁగొట్టి, ఇయ్యకోన్ = సమ్మ, తించుటకు, వసుధామరునికి = బ్రాహ్మణుని, ధాత్రీత లేశు పడఁతిన్ = రాజు