పుట:Haindava-Swarajyamu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము

.

287

కుదియంగ వెసఁ బట్టి కుత్తుక ( బిసికి
తోరంపుదివియలతో మాఱు నుండు
హారమణీశోభితాభరణములఁ
గళవళం బందక కైకొని పోయి..................................2290
మలఁగుచు నాచంద్రమతి సనుదెంచు
తెరువున కడంబు దిగన వచ్చి
గరువంబుమీఱ దస్కరుఁ డిట్టు లనియె
“నీ వేళ నీ వెంట నెవ్వరు లేక
నీవేల నీరీతి నేఁ గెద ఇంటి
నలుగక చెప్పు లె' మ్మన్న జిత్తమునఁ
గలఁగుచు నిలిచి యక్కమలదళాక్షి
వెగచి యేడ్చుచుఁ దన వృత్తాంతమెల్లఁ
దగఁ జెప్పుటయు లేనిదయఁ దాల్చి వాఁడు
“నా చెల్లెలవు నీవు నలినదళాక్షీ.............................2300
యీచందమునఁ గుంద నేల కొమ్మనుచుఁ
బన్ను గాఁ దన చేతి పసిబిడ్డ తొడవు
లన్నియు ముడి గట్టి యం దిచ్చునంత
దాది మేల్కని రాచతనయునిఁ గాంచి
మదిలోన శోకంబు మానక యపుడు
చనుదెంచి యంతయు జన నాథునకును

- త్రొక్కి పట్టి కదలక మెదలకుండునట్లు చేసి, తోరంపు ... భరణములన్ పెద్ద దీపములతో పాటిగా వెలుఁగుచున్న హారరత్న ములను శోభితము లైన త క్కిన యాభరణములను, కళవళ ము=కలవరపాటు, గరువంబు = పెద్దఱికము, వెరచి = వెక్కి, తొడవులు= భూషణములు, కుదియంగన్ = కీడ్పడునట్లుగా,