పుట:Haindava-Swarajyamu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

267

వాకట్ట మైతిమి వసుధఁ బాములకు
మందుల విలువలు మా కేడఁ గలవు
మందు పెట్టఁగ లేము మనఁ జేయ లేము ................................1930
వెదక నంపఁగ లేము వెజ్జుఁ దేలేము
మదిమదితో నుండి మా కేమి శ్రద్ధ
పీడ వాయదు మాకు బిడ్డఁడు నీవుఁ
గూడు గూరకు సడి గొట్టక యడిగి
యున్న మాటలు మాని యూరక వచ్చి
పన్నుగా నీచేయుపను లెల్లఁ దీర్చి
ప్రొద్దు వోయినమీఁదఁ బోయి నీ పుత్రు
సుద్ది నిక్కంబుగాఁ జూచి రమ్మనిన
ను త్తర మొండాడ నులికి యా సాధ్వి
చి త్తంబులో శోకశిఖి మండుచుండ.......................................1940
జాము పోయిన దాఁకఁ జాఁగఱ గొట్ట
బాములఁ బొందుచుఁ బను లెల్లఁ దీర్చి
బడలియు మఱి వచ్చి భ క్తి దీపింప
నడుగు లొత్తుచు నున్న నా విప్రవనిత
వడి జొల్లు సెలవుల వడియ నూరుపులు
నిడుదలై గొటలొట నిగుడ వెండ్రుకలు

ఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽ/

జూచెదవు, వాకట్టమైతి మి=నోరుకట్ట మైతిమి, విలువలు = వెలలు, మనఁజేయన్ = బ్రతికింపఁగా, వెజ్జు - వైద్యుని, మదిమది ...శ్రద్ధ కుడిచి నెమ్మది గా నుండి మాకీ లేనిపోని యక్కరేమి వచ్చె, పీడ... మాకు = నీబిడ్డఁడు ఏమై తే నేమి మాపీడవ దలదు, సడిగొట్టక ఇనస పెట్టక, సుద్ధి = సంగతి, ఉలికి= భయపడి, శోక శిఖి = దుఃఖాగ్ని, చాఁగఱగొట్టన్ బాధింపఁగా,. సెలవులతో = పెదవిమూలలం.