పుట:Haindava-Swarajyamu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
268

హరిశ్చంద్రోపాఖ్యానము

విరిసి జుంజురుదల వేలాడఁ జెమట
దొరుఁగుక కుంబుల దుర్గంధ మెసఁగఁ
బిసరు గాచినకుండ పేర్పు చందమున
నెసఁగిన బాకి నో రెంతయుఁ దెఱచి................................1950
కలవరింతల వాడగరితలు బెదరఁ
బెలుచఁ బండ్లును బెటపెటఁ గొర్కు కొనుచు
నొడలిచీర నెఱంగ కుదరంబు పెద్ద
తడగంబుగతిఁ దోఁపఁ దన ప్రక్కలందుఁ
జడుగును బేకయుఁ బలెఁ బడి మునిఁగి
పడుచులు గూర్కంగఁ బందిచందమునఁ
దెప్పున నిద్రఁ జెందిన యటమీఁద
నప్పద్మలోచన యల్లన లేచి
యంధ కారమును శోకాంధకారమును
బంధురం బగుచు లోపల వెలుపలను................................1960
గిరిగొని కవయంగఁ గెం గేల నొక్క
కొఱవిఁ గైకొని వడుగులు సెప్పి చనిన
కడకుఁ బోయిన త్రోవగా నొక్క తేయును

.....................................................................................................

దు, జుంజుఱుతల= పల్లతలయందు, కక్షము= చంక , పిసరు=కడిగిన ధాన్యములో త్రోపుడుపడినది, కుండ పేర్పు =కుండ పెంకు, 'బాకి = పెద్ద,తడగము = ఎద్దుమీఁద నీళ్లు తెచ్చెడి తోలుసంచి, పడుగు=వ స్త్రపు నేఁతయందలి నిడుపునూలు, పేక =వస్త్రపు నేత యందలి అడ్డనూలు, పడుచులు=పిల్లవాండ్రు, బంధురము= ఆధి కము, లోపల శోకాంధ కారమును, వెలుపల అంధ కారమును, గిరిగొని- నెల కొని, కవయంగన్ =క్రముకొనఁగా, పోయిన త్రోవఁ గా=పోయిన దే దారి గా- తాను , తెలియకపోయిన దారియే దొరిగాననుట,వటభస్మ... నుండ = కాళ్లకడ