పుట:Haindava-Swarajyamu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
266

హరిశ్చంద్రోపాఖ్యానము


జాలు లే లెమ్ము పిసాళింప' కనుచు
నాలీలదుర్భాష లాడుచు నున్న
కాలకౌశికు భార్యఁ గనుఁగొని వగపు
లోలోన నడఁచి యాలోలాక్షి పలికెఁ ..........................1910
దల్లి నామీఁద ని త్తరి దయ నుంపు
ముల్లంబులో నిది మొండుగాఁ గొన
విస మెక్కి చచ్చినో విపినంబు లోనఁ
బొసఁగంగఁ గొఱప్రాణముల నున్న వాడొ
చొప్పడ నా పుత్రుఁ జూచి రా నొకని
నిప్పుడే పంపు వాఁ డీల్గగక మున్నె
మసలక తెప్పించి మందుఁ బోయించి
పసనుగా నొనరింపు ప్రాణదానంబు'
ననుచు దైన్యము దోఁప నా రాజు దేవి
తను వేఁడుకొనుచుఁ బాదములపై బడిన. 1920
గలహకంఠిక కనికర మింత లేక
తలమని ముంగ లఁ దలఁ బాయఁ ద్రోచి
'తొలుత ఆ సొమ్ముకుఁ దో డింకఁ గొంత
గెలువఁ జూ చెదవు మిక్కిలి జాణ వౌదు
కట్టెలు దెమ్మన్న ఘసభుజంగముల
పుట్ట లెక్కఁగ నేల పోయె నీకొడుకు
చేకొని యిది మేము చేసినత ప్పె

...........................................................................................................


సేయక , కొఱప్రాణములు = కుట్టుసురు, పసను గాన్ = పొందిక గా, తలము= తొ లఁగుము, తొలుతటి .... జూచెదవు=ముందు మిమ్ముకొన్నందులకు దారపోసినరొ క్క మేకాక మఱి కొంతరొక్కము నీకొడుకు మందుమాకులకు వెచ్చ పెట్టింపఁ