పుట:Haindava-Swarajyamu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
264

హరిశ్చంద్రోపాఖ్యానము

విన్ననై పెదవులు విఱిచి దైన్యమున
నన్ను రమ్మని పిల్చు నలికొట్టుపలుకు
బలుచని చెమటతో ఫాలభాగమునఁ
గలగొన నంటిన కాకపక్షములు
దలసాల వెడలెదుదాక నా దెసకు
మలయుచూడ్కులు గలమంచినీ మోముఁ
గన్ను లఁ గట్టిన కై వడిఁ దోఁచు
చున్నది యిప్పుడె ట్లోపుదు మఱవ...............................1880
బొద్దు నేఁ డిదె క్రుంకెఁ బొలమున నుండి
'ముద్దు లేఁగలు వచ్చి మొదవు లఁ గల సె
మనమున మోహంబు మల్లడి గొనఁగఁ
జను దేవు నీవేల చన్నులు సేఁ పె
నేపరింపుదురె న న్నిట్లు మా యయ్య
నా పుత్రరత్నంబ నా నిధానంబ'
యని పెక్కు భంగుల నడలు భూపాలు
వనికపై నా వి ప్రవనిత గోపించి
'యోసి యమాంగల్య మొదవ నేడ్చెదవు

................................................................................................................

దలై విడివి గానుండుకన్నులు, సలి కొట్టుపలుకు - ని సకొట్టుమాటపో లేక సడిగా ట్టుచుండుపలుక నుట, కలగొనన్ = చెదరఁగా, కాకపక్షములు=కూఁకట్లు, తల సాల తలవాకిలి, మలయుచూడ్కులు= తిరిగి తిరిగి చూచుచూపులు, కన్ను లఁగ ట్టిన కై వడి కన్ను లలో నే యుండునట్లు, ఎట్లోపుదుమఱవ - మఱవ నెట్లు నేర్తును ముద్దు లేఁగలు = ముద్దుగులుకు దూడలు, మొదవులక్ = ఆవులను, చన్నులు సేఁ హెచ న్ను లందు పాలు చేఁపుచున్నది, ఏపరిం పుదు రె= దుఃఖ పెట్టుదురా, భూపాలువ నిత, రాజ కాంత, కలగొని= ఇటునటు వ్యాపించి, చీమల గామలవ లెను-ఇది జాతీ