పుట:Haindava-Swarajyamu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

265

యీసంధ్య ప్రొద్దు మాయింటిముందటను .................1890
గలగొని చీమల గామల వలెను
జెలఁగుచు ముందర శిశువు లాడఁగను
నీ కేల పలవింప నీకుమారునకు
నీకునుగాఁ జెడి నేఁ డిల్లుఁ బెళ్లు
బో కార్చి నట్టి యీ ప్రోడకు నేడ్వ
నాకుఁ బోవదు గాక నా సూత్రధారి
కొడుకు నెక్కడ దాఁగ గురుతుగా నంపి
కడునుగ్ర భుజగంబు గఱచిన దనుచు
వెడయేడ్పు 'లేడ్చుచు వెదకుచు సందు
వెడలి పోఁ జూ చెపో వేసాలు వన్ని......................1909
లోకంబులో లేని లొట తాటక త్తే
నీ కువాడమ్ము లన్నియుఁ దెల్సు మాకుఁ
గైకొని మేఁక లఁ గాచి రా పొమ్ము
నీకంటె మిక్కిలి నెఱజాణ నేను
గొడుకుకు విలపించు కొనుచు నీ వున్న
నెడప కెన్వరు సేతు రీపను లెల్లఁ

.......................................................................................................

యము - గుంపులు గా క్రిక్కిరిసియనుట, నీకుమారునకు ... పెళ్లు= నేఁడు నాయి ల్లును పెళ్లును -నిన్నుండియు నీకొడుకునుండియుఁ జెడినది, పో కార్చి...పోవదు పోఁగొట్టుకొన్న యాప్రోడబిడ్డకు నేడ్చుట నాకు నొప్పదు గాని - ఇట లోహితాస్యుని ప్రోడడయనుట పరిహాసపరము - ప్రోడబిడ్డ నాయనుట , సూత్ర ధారి కొడుకను= సూత్రధారివ లె పలు వేషములు నేర్చిన యాకొడుకును, దాఁగఁగు ఱుతుగా సంపి= దాఁగికొనుటకు అడియాలము చెప్పి పంపి, కడునుగ్ర భుజగంబు మిక్కిలిభయంకరమైన సర్పము, లొటతాటకత్తె= జిత్తులమారి దానవు, కువాడ మ్ములు=కపటవర్తనములు, 'నెఱజాణ=మంచి నేర్పుకత్తె, పిసాళింపక = టక్కులు