పుట:Haindava-Swarajyamu.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
262

హరిశ్చంద్రోపాఖ్యానము

యదరి భూవరు దేవి 'హా పుత్ర' యనుచు
నొదవిన వెనుమూర్ఛ నొక్కింతదడవు
తరిగినకడలి చందంబున నేల
యొరిగి చేష్టలు దక్కి యొయ్యన దెలసి
నేలలు పుడుకుచు నిగిడినవగల
వాలుఁగన్నుల నీరు వజద లై పాఱ
‘నక్కటా యో లోహితాస్య నా కింక
దిక్కెవ్వ రి టమీఁదఁ దెరు వేది బ్రతుకు
కీదుఃఖ వార్ధి నే నే తెప్పఁ గడవ
నీదురు నీవిధి కే మని వగతుఁ...............................1850
బతిఁ బాసియును నిన్నుఁబట్టి నాపట్టి
మతిని నే దిగులును మఱచి వర్తింప
నెక్కడ నుండి నేఁ డిటు వెంటనంటి
తెక్కలి దైనంబు దెక్కొనె నిన్ను
బుట్టక పుట్టిన పుట్టుభోగికిని
బుట్టభోగికిఁ బఁ బుట్ట నేమిటీకి

.................................................................................................................

భూవరు దేవి = రాజు భార్య, ఒదవిన=కలిగిన, తఱిఁగినకదళి = నఱకంబడినయరఁటి చెట్టు, పుడుకుచు= తడవుచు, నిగిడిన = సాఁగిన- అతిశయించిన, వాలుఁగన్నులు = విశాలము లైన నేత్రములు, వఱదలు=ప్రవాహములు, తెగువే.దెబ్రతుకుకు = బ్రతు కుటకు దారియేది? దుఃఖ = దుఃఖసముద్రము, ఏ తెప్పన్ = ఏది తెప్ప గాఁ గొని, - ఎవ్వరిని ప్రాపు గానాశ్రయించి, ఈమహా దుఃఖమును, కడవనీఁదుదును=దా టునట్లు ఈఁదఁగలదానను, ఈవిధికి= ఈ దైవ వ్యాపారమునకు, నిన్ను బట్టి=నీ వుండుటం జేసి, తెక్కలి = పంచన చే, తెక్కొ నెన్ = చం పెను, పుట్టక పుట్టినపు ట్టుభోగికిని= లేక లేక పుట్టి పుట్టుక మొదలుగా భోగములనుభవించుచుండువానికి.