పుట:Haindava-Swarajyamu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయభాగము.

261

పనివడి చంప నోపదు బాలు నతని
జనని పాతివ్రత్యశ క్తి పెంపునను
నది చూచి ముని పుత్రు లాశ్చర్య మంది
‘నదిలోనఁ దలఁప నీ మను జేంద్రసుతుఁడు
నిగిడినవిషవహ్ని నిలువునఁ గాలి
పొగిలి భస్మము గాక పోలించి చూడ
నలకాలకూట మహాగరళంబు
చెలఁగుచు మ్రింగి మూర్ఛితుఁ డై నశివుని
వడువున నున్నాడు వాడదు మోము
విడువదు తను కాంతి వీస మంతయున.....................1830
బదతలంబులు గాజు వాఱవు నిప్పు
జెద లంటునే వలచేతి యీరక్ష
వెలయ నే మంచు దీవించి కట్టినదొ
తలపోయ మును వీనితల్లి దా' ననుచు
నరిముఱిఁ బురమున కరిగి యావార్త
తెఱఁ గొప్పఁ జంద్రమతీ దేవితోడ
గుఱుతులు సెప్పి వడ్గులు చని రంత-
గొఱగానిపలు కనుక్రొవ్వాడి వేడి
మెఱుఁగుఁగైదువు నాటి మెఱమిన గుండె
పఱియలుగా ఐలి ప్రాణంబు వెడలి................................1840

............................................................................................................

కాలకూట...గరళంబు = హాలాహలమహావిషము, గాజు పాఱవు =గట్టి రావు, కొఱు గాని= పసమాలిన, క్రొవ్వా డివేఁడి = పుక్కిలివాఁడియైవేఁడిగానున్న ' విరుగు కైదువు = పదును బెట్టఁగా తళతళ మెఱయుచున్న వాఁడి యాయుధ లను, మెఱమినన్ = నాటి యిటునటు మెదల్చినచో, పరియలు=తునుకలు