పుట:Haindava-Swarajyamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవ ప్రకరణము.


ఇంగ్లండు స్థితి.


చదువరి: మీమాటలను బట్టిచూడగా ఇంగ్లండు పరిపాలన పద్ధతి మంచిది కాదనియు కాబట్టి అనుకరణీయము కాదనియు మీయభిప్రాయమైనట్టు తోచుచున్నది.


సంపా: మీయనుమానము సకారణమే. ఇంగ్లండుస్థితి నేడు కరుణాస్పదము, భారతభూమి కట్టిస్థితి యెన్నడు రాకుండును గాకయని నేను ప్రార్థించుచున్నాను, రాజ్యాంగ సభలకు మాతృకయని మీరెంచునట్టిది గొడ్డుపోతు, అభిసారిక. ఈ రెండును కఠినోక్తులుగా దోచవచ్చును. కాని యవి మిక్కిలి యుచితములు. ఆ రాజ్యాంగ సభ స్వేచ్ఛగా ఇదివర కొక్క మంచి పనిచేసి యెరుగదు. కాబట్టి గొడ్డుపోతంటిని. ఆ రాజ్యాంగ సభ యొక్క, స్వభావము చిత్రముగా నేర్పడినది. బయటనుండి యొత్తిడి పెట్టక అది ఒక్క పనికూడ చేయదు. అభిసారికయని యేలయంటిననగా దానిని భరించుమంత్రులు నేడొక్కరు, రేపొక్కరు. నేడు ఆస్క్విత్తుగారు, రేపు బాల్ఫరుగారు.


చదువరి: మీరు గొడ్డుపోతని ఛలోక్తిగ చెప్పినారు. అది ఈ రాజ్యాంగ సభకు అన్వయింపదు. ప్రజలు ఈసభను ఎన్ను