పుట:Haindava-Swarajyamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

|

23

ఇంగ్లండుస్థితి.

కొనుచున్నారు. ప్రజాభిప్రాయపు ఒత్తిడి కిది లోబడుచున్నది. ఇది దీనిగుణము.


సంపా: మీరు పొరబడుచున్నారు. ఇంక కొంచెము సవిమర్శగా ఆలోచింపుడు. ప్రజలు ఉత్తములను ఏరుకొందురని యనుకొందుము. సభ్యులు ఉచితముగా పనిచేయుదురు. కాబట్టి ప్రజాహితమునకే చేయుదురని యెరుంగవలెను. నిర్వాచకులు విద్యగలవారు. కాబట్టి వారు నిర్వచనములో సామాన్యముగా తప్పులు చేయ రనుకొనవలెను. ఇట్టి రాజ్యాంగ సభకు అర్జీలు మొద లైన యొ త్తిడి యవసరముండరాదు. దాని కార్యసరణి సరళముగా నడిచిపోయి తత్ఫలము దినదినము సువ్యక్తము కావలసినదే. కాని నిజమరయుదము. సాధారణముగా సభ్యులు స్వార్థపరులని కపటభావులని అంగీకృతమయియున్నది. అందులో ప్రతివాడును తన లాభాలాభములే ఆలోచించును. న్యాయముగా ప్రవర్తించుటకు ఉద్దీపకము అట్టివారికి భయము. అందుచేత నేడు చేసినది రేపు మారుచ్పుడును. ఒక్క సంగతి లోనైనను, ఇది దీనికి కడపటి స్వరూపము అని చెప్పుటకు రాదు. అతిముఖ్యములైన విషయములు చర్చలో నున్నప్పుడు కూడ ఈ రాజ్యాంగ సభ సభ్యులు కాళ్లు చాచుకొని నిద్రించుట సహజమైనది. ఒకొక్కప్పుడు వినువారికి ఏనుగుకలుగునట్లుగా సభ్యులు చేంతాడు ఉపన్యాసములు చేయుటయుకలదు. కార్లై