పుట:Haindava-Swarajyamu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

245

పూఁటకాఁప వె నీవు పొమ్మని యనక
మితి కాక మున్నె నీ మీఁదిధనంబు
మతమునఁ జెల్లింపు మా కిప్పు' డనుచు
బోధించి పక్కలు ఎడుచునవ్వడుగు
బాధకు నలసి భూపతి మది లోన
నెడపక ధనముఁ బ్రో విడి నేఁటితోడఁ
గడతుఁ గౌశికు మాయఘట్ట మే'ననుచు.........................1520
వీర బాహును జూచి విను మని పలికె
“నీరీతి నపనమ్మి కేల నా మిదం
జాల నీతని కుల్కి సత్యంబు రోజుకు
నూలిపోఁగునఁ జిక్కి నుసల కున్నాఁడఁ
దల్లి సత్యము నాకుఁ దండ్రి సుజ్ఞాన
మెల్లెడ సోదరుఁ డెసఁగు ధర్మంబు
చెలువార ధైర్యంబు చెలికాఁడు శాంతి
కులసతి వినయంబు కొడుకు చర్చింప
'నే సత్యమునకుఁగా నిప్పుడు నీకు
దాసుఁడ నై జట్టి దక్కుచున్నాఁడ....................................1530

........................................................................................................ పోక, పూఁటకాఁప వేజ నీవు నాకు మధ్యస్థుఁడవాయని చెప్పక , పక్కలువాడు చు =కడుపుప్రక్కలందు పొడిచి నిర్బంధ పెట్టు, ప్రోవిడి = రాసిగాఁ బెట్టి, కౌశికుమాయ మట్టము = విశ్వామిత్రుడు సేయు మాయల మేర, కడతు = దాఁ టుదును- అతని ! మాయలనుండి విడివడుదుననుట, అపనమ్మిక నమ్మిక లేమి, ఉల్కి= భయపడి, నూలిపోఁగున ...కున్నాఁడు=నూలిపోఁగంత యీపడుగు నకుఁ జిక్కి సత్యమునుబట్టి చలింపకు న్నాడను నూలిపోఁగువలె నాకు విడి పించుకొనుట అతి సులభముగా నుండినను సత్యమునకుఁగట్టు వడి యందుఁజిక్కి- యేయున్నాను; ఇట్లుండఁ గా నిన్ను గూడ నతిక్రమింతువా ' యని భావము. జట్టిదక్కుచున్నాఁడ= బేరమునకు లోనగుచు.న్నాఁడను, అట్టిసత్యము .. .