పుట:Haindava-Swarajyamu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

హరిశ్చంద్రోపాఖ్యానము

మొండరి చల్ల చప్పుడు గోడ చేర్పు
చండిపో తనునట్టిజాన నున్నాఁడు
చెప్పిన పని జాగు సేసిన వేళ
ముప్పిరి గొనుకోపమున మొఱ వెట్ట 1500
దుడ్డున వీఁపు కంతులు గట్ట మోఁది
జడ్డు వాపినఁ గొల్వు చాలు నా కనుచుఁ
దక్కిపోయిన వెటఁ దగుల నా వశమె
యుక్కునఁ బెనఁచిన ట్లు న్నాఁడు వీఁడు
గొలుసు దప్పి నయట్టికోఁతిచందమునఁ
గలధన మీవు రొక్కము గొని పోదు
విల్లాలు పుత్రులు హితులు బంధువులు
దల్లిదండ్రులు నన్న దములుఁ గలుగు
నాని నెమ్మది నమ్మ వచ్చు. గా కిట్టి 1510
వాని నేగతి నమ్మ వచ్చుఁ నా'క నిన
నక్షుత్రకుండు భూనాయకుఁ జూచి
'దక్షతఁ జండాలుఁ దగ నొడంబఱిచి
పూఁట పూఁటకు జరుపుడు వుచ్చి చనక


ములేదనుట. మొండరి= మొండివాఁడు, చల్లచప్పుడు=చల్లచిలుకునప్పటి సద్దు వలె గొణగువాఁడు కాని చుఱుకుఁదనము లేనివాఁడు. గోడ చేర్పు = గోడమూల లందుఁ జేరిపడియుండు మూడుఁడు, చండిపోతు = దుండగీఁడు, ముప్పిరిగొను కోపమున, మిక్కిలియతిశయించిన క్రోధము చేత, దుడ్డునకట్ట చేత, కంతులు = కణుతులు, జడ్డు = మొద్దుతనము, ఉక్కునఁ బెనఁచినట్లున్నాడు = ఉక్కు తెచ్చి మనుష్యరూపముగా చేసినట్లు విని యవయవములు మిక్కిలిదృఢములుగాను బలవంతములు గానునున్నవి. గొలుసు ... కోతి- కట్టినగొలుసునుండి తప్పించుకొన్న కోఁతి, జరుపుడు పుచ్చిచనక ఎట్లోజరిన్