పుట:Haindava-Swarajyamu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
246

-

హరిశ్చంద్రోపాఖ్యానము.

వట్టి సత్యంబు నేఁ డగు నాకుఁ బూఁట
గట్టిగాఁ జేపట్టి కలఁక పో విడువు
నీయాజ్ఞఁ దల మోచి నీ కనుసన్న
బాయక ఏపంపుపను లొడఁ గూరు
నలఁగక నా చేయునంత కాలంబు
నలసిన సొలసిన నటు నిటుఁ జనిన
మఱచిన వెరచిన మఱి నీధనంబుఁ
జెఱచినఁ బఱచినఁ జేయఁ లే ననిన
విసికిన గసికిన వెడనిద్ర నొంది
నుసలిన మసలిన నొప్పిఁ జెప్పినను...........................1540
మెఱుఁగులు గ్రము నామేటి ఖడ్గమునఁ
దఱిఁగి ర క్తము గాఱ దనతలఁ దెంచి
నీపాదములమీఁద నిలుపుదు నిదియె
నాపూని' కనిన నంతట సమ్మతించి
వీర బాహుఁడు తన వెంట నే తెంచు
ఘోరమూర్తుల నతి క్రూరవ ర్తనులఁ
దనకింకరులఁ బంపి ధనముఁ దెప్పించి
ఘనతర పర్వతాకారంబు గాను
బెను రాసి వ్రాయించి ప్రియము రెట్టింప
మునికుమారున కిచ్చి మొక్కి పొమ్మనిన....................1550
నక్షుత్రకుండు నానందంబు నొంది

.......................................................................................................

పూఁట=సత్య మేనాకు పూఁట కాఁపు - నిన్ను తిరస్కరింపననుట, కసికినన్ = కనుక్కు మన్నను, వెడనిద్ర=కొంచెమునిద్ర, నుసలినన్ = తొలఁగినను, తఱిఁగి= కోసి, ఘోరమూర్తుల = భయంకరాకారులను, ఒడఁబడ్డ = ఒడంబడిక చేసి