పుట:Haindava-Swarajyamu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

239

ద్వితీయ భాగము.

యొడ లెఱుంగక పేలె దూరక నీవు.................................1410:
కులహీనుఁడవు భానుకులజుని నన్ను
బిలిచి యే లెద నంటి వెఱపింత లేక
కట్టిన డొక బట్టి కప్పింది తోలు
చుట్టిన దొక చింపి సొమ్మెల్ల నినుము
కక్కువచ్చెడి నిన్నుఁ గనుఁగొన నకట
వక్క సేయని లేకి వాఁడవు నీవు
నే నేడ నీ వేడ నెమ్మి గౌశికుని
కే నిచ్చుధన మేడ నీలాగు మెట్టు
మెట్టుకుఁ దఱుమిన మెఱమెడుకోప
మెట్టు వుట్టదు విన్న నెవ్వరికైన'....................................1420
నావుడు వాఁడును 'నామీఁద నలుగ
దేవతులకు నైనఁ దీర దెల్లందుఁ
దప్పు లెల్లను దండధరుఁడనై వెదకి
చప్పుడు గాకుండ జనుల దండింతు.
మాటలఁ బని యేల మాకును నీకు
మాటి మాటికి నన్ను మాలవాఁ డంచు

........................................................................................................

గినగుడ్డ, సొ మెల్ల నినుము = సొమ్ము లెల్ల ఇనుపసొమ్ములు, కక్కు: వాంతి, వక్క నేయని... వాఁడవు=వక్క కుఁగూడకొఱగానట్టి అప్రయోజకుఁడవు. లేకి అనఁ గారాలినగింజలు = లేకి వాఁడనఁగా రాలినగింజ లేర్పఱచుకొని బ్రతుకు వాఁడు.. మెట్టు మెట్టుకు= అంచెకంచెకు -పయి పయిని, తఱమినన్ = ఒత్తిమాట్లాడఁగా మెఱ మెడుకోపము = మనస్సునఁ గ్రుచ్చుకొన్నట్లు బాధిం చెడుకోపము ;నా మీఁద ... తీఱదు' వాపైకోపము చేసికొనుటకు దేవతలకుఁగూడ శక్యము గాదు, 'మాకును నీకును మాటలఁబనియేల' ననియన్వయము. ఒక్క నాణెమై= ఒక్క మేని