పుట:Haindava-Swarajyamu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
240

హరిశ్చంద్రోపాఖ్యానము

నీకు రోయఁగ నేల నీతండ్రి కులము
నాకులంబును నొక్క నాణెమై యుండు
నిప్పుడే నెట్లుంటి నేమి కౌశికుని
య ప్పెట్లు దీర్చెద వవుఁ గాదొ చూడు .......................... 1430
తులువ నీమది నింత దురభిమానంబు
గలవాఁడ వీముంజిగానిచే నిట్లు
దొసఁగులఁ బడి చిక్కి దొంగ చందమున
వైస కట్టు వడి నీచవృత్తి రానేల?
"కినిసి నీతోడఁ దర్కింప 'నేమిటికి
ధనముఁ బెట్టిన నెందు దాసులు లేరె'
యనిన హరిశ్చంద్రుఁ డాయంత్యజుండుఁ
గనలీ తర్కింప నకు త్రకుం డనియె
“నలినా ప కులనాథ నాతోడ నీవు
పలికిన మాటల పద్ధతి దప్పె..........................................1440
మునినాథుతో మున్ను మునిపిన మితికి
ధన మిచ్చువానికి దాసునిఁ గాఁగఁ

.............................................................................................................

మై- ఒ కేయంతస్తు గాననుట - హరిశ్చంద్రుని తండ్రి త్రిశంకునికి విసిష్ఠశాపమున చండాలత్వముగలుగుట యిట యూహించుకొనునది, ఇప్పుడే నెట్లుంటి నేమి= నేనిప్పుడు ఎట్లుండినను నీకేమి. అవుఁ గాదొచూడు = నీ చేతనప్పుదీర్చుటకవు నో కాదోచూచుకొనుము - ఇదిచూచుకొనక నన్ను నిందింప నేలయనుట, దుర భిమానము=దురహంకారము. ముంజి గాఁడు=వడుగు, దొసఁగులన్ = తప్పులను, తర్కింప వాదులాడఁగా, మునిపిన = చెప్పినట్టి, వినుత సత్కులజునిన్ పొగడ్త కెక్కినమంచికుల మునఁ బుట్టిన వానికి, అంజక = నెనుదీయక , పల్లె... శాస్త్రమె = మంటిపిల్లియైనను పల్లె త్తి ఎలుక లఁబట్టినచో ఆంతే పిల్లి శాస్త్రము కోరిన ... నాపాలు= ఆడిగిన ద్రవ్యమిచ్చి నిన్ను గొనిపొండని వ్యర్థముగా మొఱ