పుట:Haindava-Swarajyamu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
238

హరిశ్చంద్రోపాఖ్యానము

రోజువాసము నుల్చి గుడ్లెర్ర జేసి
కెలని వారల బూతు గెరలఁ దిట్టుచును
దొలఁగు రాజెవ్వఁడు దొర యెవ్వఁ డనుచుఁ
దాగిన రోజు మత్తా గొని యిన్ని
లాగుల నల్లనల్లన నృపుఁ గదిసి
యోరువ రాక బిట్టోకిలిం తొదువ
నోరు మద్యముకంపు నూల్కొనఁ బలి కె..................1400
నోరి నాపంచినయుడిగ మేమైనఁ
గోరి సేయుచు నొఱ గొడ్డంబు లేక
కొలిచెదవేని యీ గోచి బాపనికి
వలచినధన మంతవట్టును నిచ్చి
బంటుగా నేలుదుఁ' బరఁగ ని న్న నినఁ
గంటకం బొదువ భూకాంతుఁ డిట్లనియె
“నోరి చండాలుఁడ యారకుండెదవొ
నోరు వ్రోయఁగ వ లెనో పండ్లు డుల్ల
నుడుగక కల్లు గ్రుడ్లుఱుకంగం ద్రావి

.........................................................................................

బుక్కాపొడి, నుల్చి = మెలిఁ బెట్టి, బూతు = బండమాట,కెరలన్ = మిక్కుటమగునట్లుగా, తొలఁగు ,.. డనుచు = తొలఁగిపో నా కెవ్వఁడురాజు నేను గాక మఱియెవ్వఁడుదొర, యనుచు- ఇది దారి నెదురుపడిన వారిననుమాట, త్రాగినరోఁజు మత్తా= కల్లు త్రాగుట చే నిట్టూర్పులు పుచ్చునట్టి మత్తు, బిట్టు=మిక్కిలి, ఒదువన్ = కలుగునట్లుగా, నూల్కానన్ = నెలకొనఁగా, ఊడిగము=పని, ఒజగొడ్డెము=మససునొప్పించు వంకరమాట, అంతపట్టును= పూర్ణముగా, కంటకము=అసహ్యత, డుల్లన్ = రాలునట్లు, గ్రుడ్లుఉ ఱుకంగన్ = గ్రుడ్లు వెలికి ఉబ్బునట్లుగా, కల్లుద్రావియనుట, బట్టి-అఱవుడు, చింపి = చిని .