పుట:Haindava-Swarajyamu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
232

హరిశ్చంద్రోపాఖ్యాసము

క్రొవ్వి బలురె గువ్వగుత్తుక పడక
నివి యెల్లఁ దప్పులు నెగ్గులుఁ జేసి
తివిరి 'రేఁగెద నన్నఁ దెలుప నా వశమె...........................1280
తీసారుచక్కెర దిన్న యా నోర
-నేపాకు మేసినవిధమున నీవు
చేసి నంతయు మేలు సేసి మరేల
చేసితి విట్టికుచ్చిత మింక నైనఁ
గుదుకనగోలు గైకొనక నా ధనము
వదలుము మున్ను విశ్వామిత్రుఋణము
మితితోడఁ జెల్లించి మీఁద నెట్లయిన
ధృతిఁ దీర్లు నీ బ త్తె దినముల లెక్క'
నావుడు విని నవ్వి నక్షత్రకుండు
భూవర నీకంటె బుద్ధిమంతుఁడను
దొడిఁబడఁ జేతికి దొరికిన ధనము
విడిచి మీఁదటఁ గొను వెంగలి గలఁడె
చదును మీఁదిడి దెబ్బ సుగతి గాక
పిదప నొప్పునె మతి పెక్కు లేమిటికి
విడువు మింతట నుండి వి త్తంబుమీఁది
యడియాస వైడికిఁ బ్రాణముల్ లంకె.................................1290

........................................................................................................


గుందక క్రొవ్వి బల్దు రేయనియన్వయము. గువ్వగుత్తుకపడు= ఆకటి చే హీనస్వ రమగు, రేఁ గెదనన్నన్ =విజృంభించెదను అని చెప్పఁగా, తెలుప నావశ మే= తేర్చు ట, నాతరమా చేసినంతయుమేలు చేసి = ఇంతవఱకుఁజేసినదంతయు మే లుగా నేచేసి, కుదుకనగోలు= పంచన,చదువు .. సంగతి గాక =పిమ్మటి చదువు దెబ్బకొట్టినపుడే గాని పిదప కలుగునా, ఆడియాస =వ్యర్థమైనయాస, ఈ చేతి