పుట:Haindava-Swarajyamu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయభాగము.

231

తఱలి పోవఁగ నీక ధర గిరి గీచి
మొఱలు వెట్టఁగ గట్టి ము వ్వెతఁ బెట్టి
గుదిగుది గావించి కూరాకు సేసి
యదలించి నిను మేకయజిపుఁ గూయింపఁ
జనుఁ దప్పె నది నేఁడు సర్వధా నిన్ను
వెనకముందటిపగ వెడల మరలు
మఱవకు మిప్పటిమాటల నెల్ల
నెఱిఁగెడు శివుఁడు నా కేటికి బాస'
యనిన హరిశ్చంద్రుఁ డొవటు ధూర్తుఁ
గనుఁగొని కోపంబు గదుర నిట్లనియే ............................1270
'గురు కార్య మొనరింపఁ గోరి నా వెంట
నరు దెంచి తిరిగి వది నాకు సెలవై
పరదేశులకు గుళ్ల పంచలు గాక
యిర వైనసున్న పుటిం డ్లేడఁ గలుగుఁ
బలుగూడు గాక యేపట్టున నైనఁ
గలదె పాయసము భిక్షాం దేహి యసిన
నెవ్వగఁ గుందుచు నీర సాన్న ములఁ

.......................................................................................................

గడువు, ధరగిణి గీఁచి= నేల గీర గీఁచి, మొఱలు పెట్టఁగఁ గట్టి=నీవు కుయ్యో మొ ర్రోయని కూయిడునట్లు ఆగిరిలో నిలువఁబెట్టి, మున్వెత= తాపత్రయము, గుడి గుది = గుత్తిగుత్తి, మేఁకయఱపుఁగూయింపన్ చనున్ = మేఁకవలె నఱచు నట్లు చేయఁదగును, వెనుక ....మరల్తు. = ముందు వెనుక నాకు నీయందుఁగలపగ యంతయుఁ దీరునట్లు సుళ్ల బెట్టుదును, ఎఱిఁ గెడు... బాస= నేను పగదీర్చు కొందునని యొట్టు పెట్ట నేల - నీవు చేసిన దానికి శివుఁడే యెఱిఁగి ప్రతిఫలమియ్యం గలఁడు. నాకు సెల వె= నాకువ్యయమా-గురు కార్యమునకు వచ్చినందులకు నీకుఁ జేయవలసినవ్యయము గురునిదే కాని నాది కాదనుట. నీరసాన్న మలన్ నెవ్వగఁ