పుట:Haindava-Swarajyamu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

233


విడుతుఁ బ్రాణము లైన విడువ ధనంబు
మెడ మెండుకొని తెంపుమా చేతి హేతిఁ
దల దెవ్వ మొ త్తి యీధనముఁ గైకొనుము
వెలయంగ నాచావు వెదకుఁ గౌశికుఁడు'.....................................1300
ననిన వీనులు మూసి హరహరా యనుచు
జననాథుఁ డాత్మలో సంతాప మంది
కడుఁబడ్డధూర్త నక్షత్రకు నోరు
దొడుకుట పాపంబు దుర్మార్గుడితఁడు
బల్లిదు చేతిలోఁ బడినధనంబు
పిల్లినట్టిన దొబ్బ ప్రిదులక పోయె
బొంకు గాకుండ నా పూనినమితికి
నింకఁ గౌశికుఋణ మేమిటఁ దీర్తు'
నని మదిఁ దలపోయ నా మహారాజు
గనుఁగొని కినిసి నక్షత్రకుం డనియె
'నూరకనివ్వెఱగొంది యిట్లున్న
నేరీతి మాధనం బిటమీఁద వచ్చు.
జెచ్చెర నొక త్రోవఁ జేసి మమ నిపి
పుచ్చిన బోదు మీపోరాట ముడిగి
వడి నారఁ గైకొన వచ్చు చట్రాత

............................................................................................................

హేతీక్ = ఈనీ చేతిలోనుండు ఖడ్గము చేత, మెడ మెండుకొని తెంపుము= నా మెడ విజృంభించి తెగ నఱుకుము, నోరుదొడుకుట= నోరు మెదల్పఁజేయుట-మాట లాడించుట యనుట. బల్లీదు ... బొబ్బ-బలవంతుని చేతిలోఁజిక్కినధనము పిల్లి పట్టుకొన్న మాంసఖండమువలె మరలఁదీసికొన శక్యము గాదు ప్రీదులక పోయె =సడలి మరలిరాదయ్యే, వడి ...చట్రాత = చట్టురాతినుండి నారు -