పుట:Haindava-Swarajyamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
20

హైందవ స్వరాజ్యము.


చదువరి: ఈ ప్రశ్నయు వ్యర్థమే. సంపూర్ణ స్వరాజ్యమునకు కావలసిన శక్తులు మనకున్నప్పుడే ఇది సాధ్యము. అప్పుడు మన పతాకమునే యెత్తవచ్చును. జపాను ఎట్లున్నదో భారతభూమి అట్లుండవలెను. నౌకాసైన్యము భూసైన్యము అన్ని మనవిగా నుండవలెను. మన తేజోవికాసము మనకుండి ననే భారతభూమిపేరు లోకమున మ్రోగ గలదు.


సంపా: మీరు విషయము బాగుగనే చిత్రించినారు. మీ యర్థమిది. మనకు ఇంగ్లీషువా రక్కర లేదు. పరిపాలన పద్ధతి కావలెను. వ్యాఘ్రస్వభావము కావలెను. వ్యాఘ్ర మక్కర లేదు. భారతభూమిని ఇంగ్లీషు చేయుదురు. అప్పుడు ఇది హిందూస్థానము కాదు. ఇంగ్లీషు స్థానమగును. నేను కోరు స్యరాజ్యము అది కానేరదు.


చదువరి: నాయభిప్రాయమున స్వరాజ్య మెట్లుండవలెనో చెప్పినాను. మనము చదివే చదువు ఉపయోగకరమేని, మిల్లు, స్పెన్సరు ఇతర ఇంగ్లీషుగ్రంథకర్తలు అనుకరణీయులేని, ఆంగ్ల రాజ్యాంగసభ అట్టి సభలన్నిటికిని మాతృక యేని, మనము ఇంగ్లీషు వారిని బాగా అనుకరింపవలసినదే. వారు తమభూమిలో నెట్లు ఇతరులను కాలూన నీయరో మనము వారినిగాని మరి యితరులనుగాని మనభూమిలో కాలూన నీయరాదు. వారు వారి దేశములో చేసినంత పని. ఇతర దేశములలో ఎక్కడను జరు