పుట:Haindava-Swarajyamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19

స్వరాజ్యమనగా నేమి.

వలసియున్నది. మిమ్మును ప్రతి ప్రశ్నలడుగుట చేత నే ఆపనిని నిర్వహింతును. ఇంగ్లీషువారిని మీరేల వెడలగొట్ట వలెననుచున్నారు.


చదువరి: వారి పరిపాలనవలన భారతభూమి దరిద్ర దేవత పాలైనందుచేతనే. వారు సంవత్సరము సంవత్సరము మన ద్రవ్యము తీసికొనిపోవుచున్నారు. దేశములోని ఉత్తమోద్యోగములు తామే యనుభవించుచున్నారు. మనల బానిసలుగా పెట్టిపెట్టినారు. మనయెడల వారు తృణీకార భావముతో ప్రవర్తింతురు. మనమాట వారికి లక్ష్యమే లేదు.


సంపా: వారు మనద్రవ్యమును తీసికొనిపోక నయముగా ప్రవర్తించుచు మనకు గొప్ప యుద్యోగములిచ్చి పరిపాలన చేయు నెడల వారిక్కడనుండుట చెరుపని మీరు తలంచెదరా?


చదువరి: ఈ ప్రశ్నలకు అర్థము లేదు. పులి స్వభావమును మాన్చుకొనునెడల దానితో సహవాసము చేయుటలో దోషముండునా? అని యడిగినట్లున్నది. ఇది వృధా ప్రశ్న. పులి నైజము మారునట్లైన ఇంగ్లీషువారి నైజమును మారవచ్చును. ఇది సాధ్యము కాజాలదు. సాధ్యమని నమ్ముదుమేని అది యనుభవ వ్యతిరేకము.


సంపా: కనడావారికి దక్షిణాఫ్రికావారికి కలయట్టి స్వరాజ్య పద్ధతి మనకు సిద్ధించునట్లైన చాలునా?