పుట:Haindava-Swarajyamu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
230

హరిశ్చంద్రోపాఖ్యానము

నూరూరిగుడిపంచ నొదిఁగి నిద్రించి
తిరిసిన పలుగూడు దెచ్చి నిచ్చలును
వరుస నొక్కొకకడి వనరుచుఁ గుడిచి
చదువును సంధ్యయు జపమును వేల్మి
మొదలు ముట్టఁగఁ బోయి మోటనై బడలి ...................1250
చిడుము గోకుచు జరఁ జిక్కి నట్లుండి
కడపట బత్తెంబు గాన కే తేర
నడుమఁ జావఁగ నీవు నా తలపుండ్లు
గడిగి రక్షించెదో కఱవు కాలమున
నురిసిన పుండ్ల పై నుప్పును జల్లి
కెరలఁ జేసెదవు నే గినిసితి నేని
చక్కఁ బెట్టగ లేరు సాధువు "రేఁగఁ
బొక్కి నిల్వదు తలపొలమునఁ గాని
మే లెరింగెద వని మితి వచ్చు దాఁక
నాలిని నిన్నుఁ గాసాడితిఁ గాక ......................................1260

.......................................................................................................

మె త్తి తెచ్చిన పలువిధము లైన యన్నము, కడి= యుద్ద, వనరుచున్ = కుందుచు' వేల్మి = హోమము, మొదలు పెట్టఁగ పూర్ణ ము"గా, మోట నై = మొద్దడ నై, చిడుము =తీటకురుపు, జరఁజిక్కినట్లు = ముసలితన మువచ్చినట్లు , ఏ తేరన్ = రాఁగా, నడుమన్ చావఁగా = దారినడుమఁ జచ్చితి నేని, నాతల పుండ్లు గడిగి - ఇదిజాతీయము= నాకడగండ్లు తీర్చి, ఉరిసిన పుండ్లు = పగిలిన పుంటికలు కెరలన్ =మండునట్లు, చక్కబెట్టఁగ లేరు = నన్ను సమాధాన పెట్టి శాంతున్ని జేయ లేరు, సాధువు... గాని = సాదు వై నవాఁడు కోపమున విజృంభిం చెనెని తలపొలమున నే కాని తక్కినచో నిలుపఁడు, మేలు ఎఱుంగుదువని నాకుఁజేయ వలసిన ఉపకారము నీకునీవే తెలిసికొందువు గాని నేనడుగవలసినది లేదని, మితి= -