పుట:Haindava-Swarajyamu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

229


బత్తె మి మ్మని నన్నుబలుకఁ డొండేని
నీకు నే నొడఁబడ నేఁ డీధనంబు
చేకూఱ గైకొని చిక్కులు వెట్టి....................................1230
తప్ప నాడెద వసత్యంబున కోర్చి
చెప్ప నే మున్నది శివుఁ డొక్కఁ డెఱుఁగు'
నావుఁ డిట్లని పల్కె నక్షత్రకుండు
'భూవర నీ వెంటఁ బుత్తెంచు నపుడు
నీచేత బత్తెంబు నిచ్చలు గొనఁగ
నాచెవిలోఁ జెప్పి నాఁడు మగ్గురుడు
నీ వెడఁబడ నేల నిను వేఁడ నేల
నీవు లేదన నేల నినుఁ బ్రభాతమున
దీవింప వచ్చిన దీనవి ప్రుఁడనె
చావ నొవ్వఁగఁ బూని సాహసం బొదవ ............................1240
నెడపక గిరు లెక్కి యేళులు దాఁటి
కడు భయంకరమహాగహనముల్ గడచి
కాలు గాలినపిల్లి కరణి నీవెంట
నేల నీబంటనై యెల్లందుఁ దిరిగి
వారక హిమనర్ష వాతాతపముల

.............................................................................................

గాన్ =రూఢిగాననుట,రొక్కించి=-రొక్కము రూపము గా, ఒండేని= ఒక్కటి యు, చేకూఱక్ = దొరకఁగా నే, తప్పనా డెదవు తప్పి పలి కెదవు, ప్రభాతము నన్= వేకువను, దీనవిప్రుఁడ నే= దరిద్ర బ్రాహ్మణుఁడ నా కాదనుట. గహన ముల్ -చొరరాని యడవులు, కాలు గాలిన పిల్లికరణి = కాలికి చిచ్చుదగిలిన పిల్లి విధమున, నీ వెంట నేలన్=నీ వెంబడిచోట, ఎల్లందున్ = ఎల్ల యెడలను, హిమ... తపములు = మంచువాన గాలి యెండలు, తిరిసిన పలుగూడు = బిచ్చ. -