పుట:Haindava-Swarajyamu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
228

హరిశ్చంద్రోపాఖ్యానము

జాడల దీవించి సమ్మతి: బలికె
'గురుఁడు పుత్తేరంగఁ గోరి నీ వెంటఁ
దిరుగుచుఁ దరు వున్న దినముల కెల్ల
జెల్లింపఁ గలబ త్తే సెలవుగా నీవు
చెల్లించితివి నాకుఁ జెల్లె ధనంబు
మితితో డ నొసఁగుము మేకొన్న గాధి
సుతునిఋణం బెల్లఁ జొప్పడఁ దీర్చి
పొమ్మన్నదీవించి పోదు నీతోడ
దొమ్ములు రేఁపక దొసఁ గెల్ల నుడిగి'.............................1220
యనుటయుఁ దల యూచి యమ్మహీవిభుఁడు
తనలోన నవ్వి యాతని కిట్టు లనియెఁ
“బగ గొని కృప మాలి బందెలు వెనఁచి
తగునె నా చేతి విత్తము రిత్త గొనఁగఁ
దఱలక నా మీఁద దరువుండ నిన్ను
దరిమి పుత్తెంచున త్తరి భవద్గురుఁడు
సత్తుగా నీకు నిచ్చలును రొక్కించి


............................................................................................................


నను అవ కాశములేకుండునట్లు, పుత్తేరంగన్ = పంపఁగా, తరువున్న దినములకె ల్లన్=తప్సీలు గానుండిన నాళ్లకన్నిటికిని- ఇట భార్యను బిడ్డను అమ్మినధనము న క్షత్రికుఁడు విశ్వామిత్రునిఋణమునకు చెల్లుగా పెట్టుకొనక తనతిప్పిలుండినది నములకు బత్తె సెలవుగా పెట్టుకొన్నాఁడని తెలియునది, మితితోడ =గడు వునకు సరిగా, మేకొన్న = ఒప్పుకొన్న, గాధిసుతుని= విశ్వామిత్రుని, దొమ్ముల దొమ్మిజగడములు, రేపక = ఎత్తి పెట్టుకొనక , దొసఁగు=దోషము, బం దెలు పె వఁచి=నిర్బంధములలోఁ జుట్టి, కొత్తగొనఁగ?" =వ్యర్థముగా నీబత్తే సెలవునకని పు చ్చుకొనుటకు, తఱమి= బలాత్కరించి, పుత్తెంచు నత్తరి =పంపున పుడు, నత