పుట:Haindava-Swarajyamu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

227

నీపోటువాటున నిపు డిట్లు ముమ్ము
బోరించితివి జంత్రి బొమ్మ నా యక్క
నీరఁ జి చ్చెగయింప నేర్చినతల్లి
యెచ్చట నుండి నీ విటు దాపురముగ
వచ్చితి చొచ్చితి నాస మీ వనుచు..............................1200
నోడక కురులు బిట్టొడిసి రాఁ దిగిచి
మూడి వో దాఁకించి మూతులు నులిమి
యెగ్గులుఁ దప్పులు నెన్ని యీరీతి
పగెల నిచ్చలు బాములఁ బెట్టి
యిడుమలఁ గుదియించి యించుక సేపు
నెడపక పనులు సేయించుచు నుండి
నట హరిశ్చంద్రుండు నప్పు డారీతిఁ
గుటిల కుంతలి నమ్మి కొన్న ధనంబు
వ్రయము గాకుండ సర్వంబును ముడిచి
నయ మొప్ప నిచ్చిన నక్షత్రకుండు..........................1210
వేడుకఁ గైకొని విభుని వేవేల


....................................................................................................

పొడ =ఆ కారము, పోటువాటు= పొడుచుట కొట్టుట, జంత్రి బొమ్మ= యంత్రపు బొమ్మ, నాయక్క - ఇది నీచపరముగా చెప్పినమాట, నీరన్చిచ్చు ఎగయింప నేర్చిన తల్లి = జనీళ్లుపోసి అగ్గిని రగులునట్లు చేయ నేర్చినది- చల్లగా నే మాకిట్టి జగ డము పెట్టించిన దాన వనుట. లేక నీటియందు నిప్పుఁ బుట్టింప నేర్చినదనియు న ర్థాంతరము దోచుచున్నది కాని యిదిసరి కాదు. దాపురముగ-ప్రాప్తముగా, చొచ్చితి వాసము= నాయిల్లు చొచ్చితివి, బిట్టు=గట్టిగా, మూడివోఁదాఁకించి =పృష్ఠము అడుగువఱకును తలను వెండ్రుకలుపట్టి యీడ్చివంచి, ప గెలన్= సామ థ్యపు మాటల చేత, నిచ్చలు= తనయిచ్చవచ్చినట్లు, బాములు= బాధలు, ఇడు మలు= ఆపదలు, కుదియించి=స్రుక్కించి, ఇంచుక సేపు నెడపక = కొంత సేపయి.