పుట:Haindava-Swarajyamu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
216

హరిశ్చంద్రోపాఖ్యానము

యెండి పోయినవాలహీనవానరునిఁ
గుండకోళకునిఁ గర్కోటకుఁ డనెడి
కుటిలజాతుని బందికుక్క వీక్షించి.....................................1000
'తటుకునఁ దుము పంతముఁ జెప్పు మనిన
దినము వారముఁ బొడ్డు దిక్కును గ్రహము
నొనర నెన్నినరీతి నొకకొన్ని యెన్ని
‘కలుగు నిప్పుడు గృహకలహంబు మీకు
దలపోసి చూడఁ దథ్యం' బన్నఁ గలఁగి
“తప్పదు నీ మాట తార్కాణ మాకుఁ
జెప్పితి మును తుమ్ము చేకొన కేఁగి
నా కూ రిపత్ని చే నడు నెత్తి వగుల
రోకట నొక పెట్టు రూఢిగాఁ బడితి
ముండకూతురు కిన్క ముక్కునబంటి.............................1010
గుండె జల్లను నది గోపించే
పడఁతి గా దది నన్నుఁ బట్టి మర్దింపఁ


................................................................................................. నిలుచున్నప్పుడు వేగతుమినట్టివాడును, చిక్కిపోయినతోక లేనికోఁతిపంటి వాఁడును - దీనిచే వానరమువలె వికారరూపును ధూర్త చేష్టలునుగలవాఁడని తెలియునది, కుండగోళకుని . కుండుఁడనఁగా స్త్రీ కి మగఁడుండఁగా ఱంకు మగనికిఁ బుట్టిన కొడుకు, గోళకుఁడనఁగా విధవకు అంకుమగ నివలనఁబుట్టిన కొడు కు-ఇచట కుండగోళకుఁడనుట కేవలనిందామాత్రపరము,కుట్లజాతునిక్ = పుట్టుక చేత నే కపటుఁడై నవానిననుట, బందికుక్క = బందిపోటువారలుపయోగించు కుక్క వంటివాఁడనుట - క్రూరత్వమను చౌర్యమునుగలవాఁడనిభావము. తుమ్మ పంతము= తుమ్మినందులకు ఫలము, తార్కాణ= మూఁదల- సరిదాఁకునది. చెప్పితి ...కేగి = ముందుతుమ్మఫలము నీవు చెప్పితివిగాని దానిని పాటింపక నేనులోపలికి బోయి, కిన్క ముక్కు నబంటి =కోపము ముక్కు వఱకుఁగలది, తలపుచ్చుక = త